iDreamPost

ఇంత అందమైన భార్యని ఇంట్లో పెట్టుకుని ఇదేమి పని? వైరల్ క్రైమ్!

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. అలాంటి ఘటనే హాసన్ జిల్లా చోటు చేేసుకుంది.

ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తల మధ్య వివాదాలు ఒకరినొకరు చంపుకునే స్థాయికి వెళ్తున్నాయి. అలాంటి ఘటనే హాసన్ జిల్లా చోటు చేేసుకుంది.

ఇంత అందమైన  భార్యని ఇంట్లో పెట్టుకుని ఇదేమి పని? వైరల్ క్రైమ్!

వేద మంత్రాల సాక్షిగా.. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన జంటను నిండు నూరేళ్లు కలిసి జీవించాలని పెద్దలు దీవిస్తుంటారు. ఇటీవల పెళ్లైన కొంత కాలానికే పలు కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఇటీవల కొంతమంది దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, ప్రేమ వ్యవహారాలు ఇలా ఎన్నో కారణాల వల్ల క్షణికావేశానికి గురై ఎదుటి వారిని చంపడమో.. తాము చావడమో జరుగుతుంది. ఇక అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. హాసన్ జిల్లా మహిళ అనుమానాస్పద మృతి కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

హాసన్ జిల్లా చన్నరాయపట్నం తాలూకా నాగయ్యనకొప్పలు గ్రామంలో సురభి(25) అనే వివాహిత అనుమానాస్పద మృతి చెందింది.  హున్‌సూరుకు చెందిన మహిళకు నాగయ్యనకొప్పలు గ్రామానికి చెందిన దర్శన్‌తో మూడేళ్ల క్రితమే వివాహమైంది.  పెళ్లైన కొత్తలో ఈ  జంట ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్నారు. కొంత కాలంగా భార్యాభర్త మధ్య విభేదాల కారణంగా తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే  దర్శన్ సురభి కుటుంబీకులకు ఫోన్ చేసి  మీ కూతురుకి బీపీ డౌన్ అయి హఠాత్తుగా చనిపోయిందని చెప్పాడు. విషయం విన్న సురభి తల్లిదండ్రులు ఒక్కసారే షాక్ కి గురయ్యారు. అంతేకాదు సురభి తల్లిదండ్రులు దీనికి అంగీకరించలేరు. ఆమె ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి లోబీపీ వ్యాధి లేదని, తన కూతురిని భర్తే హత్య చేశాడని ఆరోపించారు.

దర్శన్‌కు సురభితో వివాహమైనప్పటికీ వేరొకరితో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలియగానే సురభి బాధపడింది.  ఈ విషయంపై పలుమార్లు భర్తను ప్రశ్నించింది. దీంతో దర్శన్ సురభితో గొడవపడ్డాడు. తమ కూతురు అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సురభీ తల్లిదండ్రులు.  చన్నరాయపట్నం ఆసుపత్రిలో మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు.  దర్శన్‌తో పాటు అతని తల్లిదండ్రులపై సురభి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. శ్రావణబెళగొళ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి