iDreamPost

Gold and Silver Rates: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో రోజు రోజుకీ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది.

దేశంలో రోజు రోజుకీ బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు బాగా పెరిగిపోతుంది.

Gold and Silver Rates: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత నెలలో పసిడి చుక్కలు చూపించింది. వరుసగా ధరలు పెరిగిపోవడంతో బంగారం కొనేవారు ఆలోచనలో పడ్డారు. వాస్తవానికి అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల కారణంగా పసిడి ధరలు తరుచూ పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. దేశంలో కొంతకాలంగా బంగారం వినియోగం ఎక్కువైంది. పెళ్లిళ్ళు.. ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా గోల్డ్ కొంటున్నారు. దీంతో బంగారానికి బాగా డిమాండ్ పెరిగిపోయింది. కొత్త ఏడాది రెండు రోజులు బంగారం స్థిరంగా కొనసాగినా.. మళ్లీ షాక్ ఇస్తుంది. ఈ ఏడాది చివరి నాటికి బంగారం ధరలు తులం రూ.70 వేలకు చేరే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం…

భారత దేశంలో మహిళలు, పురుషులు బంగారు ఆభరణాలు అంటే ఎంతో ఇష్టపడతారు. ఇక పండుగులు, పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే చాలు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. ఎప్పటికప్పుడు వెరైటీ ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే కొంత కాలంగా పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వస్తున్నాయి. మూడు రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం మళ్లీ పుంజుకుంది. బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి పై రూ. 200 పెరిగింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ పై రూ. 220 వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,090 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక కిలో వెండి ధర రూ. 80,000 వద్ద కొనసాగుతోంది.

today gold rates

ఇక దేశంలోని ప్రధాన నగరాలు అయిన ఢిల్లీ లో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.58,900గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,240గా ఉంది. ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు, కేరళా, కోల్‌కొతా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,750 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 64,090 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.59,200 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 64,580 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై,హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో కిలో వెండి ధర రూ.300 వరకు పెరిగి రూ.80,300కి చేరింది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర రూ. 78,900 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి