iDreamPost

స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

  • Published Mar 24, 2024 | 10:25 AMUpdated Mar 24, 2024 | 10:25 AM

Gold and Silver Rates: గత నెలలో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు మార్చి నెలలో మళ్లీ పుంజుకున్నాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.

Gold and Silver Rates: గత నెలలో భారీగా తగ్గిన పసిడి, వెండి ధరలు మార్చి నెలలో మళ్లీ పుంజుకున్నాయి. రెండు రోజుల నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి.

  • Published Mar 24, 2024 | 10:25 AMUpdated Mar 24, 2024 | 10:25 AM
స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం అంటే ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడతారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రస్తుతం గోల్డ్ రేటు లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. గత నెలలో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఈ నెల మొదటి రెండు వారాలు చుక్కలు చూపించాయి. మొన్నటి వరకు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. కాకపోతే వెండి ధర మాత్రం తగ్గడం లేదు. నేడు పసిడి ధరల స్థిరంగా కొనసాగుతుంది. మార్కెట్ లో ఈ రోజు బంగారం ఎలా ఉన్నాయో చూద్దాం.

ప్రస్తుతం దేశంలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. బంగారు ఆభరణాలు కొనేందుకు మహిళలు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ఇటీవల జరుగుతున్న కీలక మార్పులు ప్రభావం పసిడి, వెండిపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధరల్లో మార్పులు జరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్న వేల బంగారం కొనుగోలు చేస్తే మంచిదని అంటున్నారు నిపుణులు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్ , విశాఖ, విజయవాడ, 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.61,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.66,280 వద్ద కొనసాగుతుంది. హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ. 80,500 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.61,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.66,970 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.61,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు బంగారం ధర రూ.67,470 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా 22 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.61,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములకు పసిడి ధర రూ.66,820 వద్ద కొనసాగుతుంది. కర్ణాటకలో కిలో వెండి ధర రూ. 76,000, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,500, ముంబై లో కిలో వెండి ధర కిలో రూ. 77,500 వద్ద కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి