iDreamPost

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: గత నెలలో బంగారం, వెండి ధరలు తగ్గి కొనుగోలు భారీగా పెరిగిపోయాయి. గత పది రోజులు నుంచి మాత్రం పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

Gold and Silver Rates: గత నెలలో బంగారం, వెండి ధరలు తగ్గి కొనుగోలు భారీగా పెరిగిపోయాయి. గత పది రోజులు నుంచి మాత్రం పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.

భారీగా పెరిగిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేయలనుకునేవారికి బ్యాడ్ న్యూస్. వరుసగా పసిడి ధరలు పెరిగిపోతున్నాయి. గతే ఏడాది చివరల్లో బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. కొత్త ఏడాది జనవరి, ఫిబ్రవరిలో కాస్త పరవాలేదు అనిపించినా.. మార్చి నెలలో ధరల్లో ఒక్కసారే మార్పులు వచ్చాయి. గత పది రోజుల్లో బంగారం ధర అస్సలు తగ్గకపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం బంగారం, వెండిపై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం రూ.65 వేల మార్క్ దాటిపోయింది. శనివారం మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలో ప్రస్తుతం బంగారం విలువ మరింత పెరిగిపోయింది. వేసవి కాలంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో అప్పుడే పసిడి ధరలు ఆకాశాన్నంటిపోతున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగిన ధరలు చూస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. గత నెలలో పసిడి ధరలు బాగానే తగ్గాయి.. కొన్ని రోజుల వరకు స్థిరంగా కొనసాగాయి. కానీ వారం పది రోజుల నుంచి పసిడి ధరల్లో విపరీతమైన మార్పులు వచ్చాయి. రోజు రోజు కీ పెరిగిపోతున్న ధరలు చూసి బంగారం కొనుగోలుదారులు ఆలోచనలో పడ్డారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో  22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.60,260 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,730 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.78,500 వద్ద కొనసాగుతుంది.

ఇక ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,890 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.60,260 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,740, వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.61,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,610 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.74,600, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.75,600 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 78,500లు ఉండగా, ఢిల్లీ లో రూ.75,600 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి