iDreamPost
android-app
ios-app

గుడ్ న్యూస్.. భారీగా పతనం అవుతున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వచ్చాయి. కొత్త సంవత్సరం పసిడి ధరలు స్థిరంగా ఉండటమే కాదు.. భారీగా తగ్గుముఖం పట్టాయి.

గత రెండు నెలలుగా బంగారం, వెండి ధరలు ఆకాశమే హద్దుగా పెరిగిపోతూ వచ్చాయి. కొత్త సంవత్సరం పసిడి ధరలు స్థిరంగా ఉండటమే కాదు.. భారీగా తగ్గుముఖం పట్టాయి.

గుడ్ న్యూస్.. భారీగా పతనం అవుతున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

బంగారం కొనుగోలు చేసేవారికి ఒక ఇది సువర్ణ అవకాశం.. వరుసగా రెండో రోజు బంగారం భారీగా తగ్గింది. గడిచిన కొద్ది రోజులుగా పసిడి ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొత్త ఏడాది సందర్భంగా బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు పసిడి బాటలోనే వెండి కూడా నడుస్తుంది. భారతీయ మహిళలకు బంగారం అంటే అమితమైన ప్రేమ చూపిస్తారు. పండుగలు, పెళ్లిళ్ళు, శుభకార్యాలకు బంగారు ఆభరణాలు కొనేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. కొద్దిరోజులుగా పసిడి ఆల్ టైమ్ హైక్ చేరుకున్న దశలో రెండు మూడు రోజుల నుంచి  క్రమంగా దిగి వస్తుంది.  శుక్రవారం మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

పసిడి ప్రియులకు గొప్ప శుభవార్త.. గత రెండు నెలలుగా చుక్కలు చూపిస్తున్న గోల్డ్ రేటు ఈ వారం తగ్గుతూ వస్తుంది. రెండు రోజుల వ్యవధిలో పెద్ద మొత్తంలో తగ్గడంతో బంగారం కొనుగోలుకి ఇదే మంచి సమయం అంటున్నారు నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ లో అనిశ్చితి పరిస్థితులు ఏర్పడటం వల్ల పసిడి ధరల్లో మార్పులు సంభవిస్తున్నాయి. బంగారం తో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గుముఖం పట్టాయి. దీంతో మహిళలు పసిడి, వెండి కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.400 తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.440 తగ్గింది. హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,380 వద్ద ట్రెండ్ అవుతుంది.

today gold rates

దేశంలో ప్రధాన నగరాలు ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 58,250 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,530 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,040 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై తో పాటు బెంగళూరు, కోల్‌కతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,100 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,380 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే.. కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, పుణె, బెంగళూరులో కిలో వెండి ధర రూ. 76,600 వద్ద కొనసాగుతుంది. కేరళ, చెన్నైలో కిలో వెండి ధర రూ. 80,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి