iDreamPost

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

భారత దేశంలో బంగారం అంటే మహిళలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు అంటే ఖచ్చితంగా వెరైటీ బంగారు ఆభరణాలు కొనేందుకు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతుంటారు.

భారత దేశంలో బంగారం అంటే మహిళలు ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ముఖ్యంగా పండుగలు, శుభకార్యాలు అంటే ఖచ్చితంగా వెరైటీ బంగారు ఆభరణాలు కొనేందుకు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతుంటారు.

పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

గత కొన్నిరోజులుగా బంగాజం ధరలు తగ్గుతూ.. పెరుగుతూ వస్తున్నాయి. ప్రపంచంలోని మార్కెట్ లో నెలకొంటున్న అనిశ్చిత వల్ల తరుచూ బంగారం ధరలు మారుగు వస్తున్నాయని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సెప్టెంబర్ లో వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరల గత నెల నుంచి భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం దీపావళి, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎంతో ఉత్సాహ పడుతున్నారు. ఈ సమయంలోనే బంగారం ధరలు మరింత ప్రియం అవుతున్నాయి. గత నెల నుంచి వందల్లో పెరిగిపోతూ వస్తుంది. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ రూ.62 వేల వరకు చేరింది..త్వరలో రూ.65 వేల మార్క్ దాటీ అవకాశం కూడా ఉందని అంటున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారం అంటే మహిళలు, పురుషులు తెగ ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా పండుగుల, శుభకార్యాల సమయంలో మహిళలు జ్యువెలరీ షాపులకు క్యూ కడుతుంటారు. వెరైటీ బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఉత్సాహపడుతుంటారు. ఇదే సమయంలో బంగారం ధరలు తరుచూ పెరిగిపోతూ వస్తున్నాయి. గత నెల నుంచి ప్రతిరోజూ పసిడి పెరిగిపోతూ వచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధర ఏకంగా 62 వేల కు చేరింది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ.100, 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, వరంగల్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.56,600 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,750 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరల విషాయానికి వస్తే.. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.61,900 వద్ద ట్రెండ్ అవుతుంది. కేరళ, ముంబై, బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,600 గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.61,750 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,000 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 62,180 వద్ద ట్రెండ్ అవుతుంది. మార్కెట్ లో కిలో వెండి ధర విషాయానికి వస్తే.. ముంబైలో కిలో వెండి ధర రూ.74,100 వద్ద ఉండగా, చెన్నైలో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ట్రెండ్ అవుతుంది. బెంగుళూరులో రూ.74,000 గా ఉండగా తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, విజయవాడ, విశాఖ, లో కిలో వెండి ధర రూ.77,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి