iDreamPost

పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే

  • Published Sep 15, 2023 | 8:25 AMUpdated Sep 15, 2023 | 8:25 AM
  • Published Sep 15, 2023 | 8:25 AMUpdated Sep 15, 2023 | 8:25 AM
పసిడి ప్రియులకు భారీ ఊరట.. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే

శ్రావణ మాసం ప్రాంరభం నుంచి భారీగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధర.. గత కొన్ని రోజులుగా దిగి రావడం లేదంటే స్థిరంగా ఉండటం జరుగుతోంది. ఇక యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే వార్తలు వెలువడుతుండటంతో.. బంగారం ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది పసిడి ధరలు గరిష్టాలకు చేరుకున్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా బంగారం ధర భారీగా పెరుగుతుందని అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. ఈ క్రమంలో బంగారం కొనాలనుకునే వారు ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ, పెరుగుతూ ఒడిదొడుకులకు లోనవుతున్న పసిడి ధరలు శుక్రవారం (సెప్టెంబర్‌ 15) మాత్రం స్థిరంగా కొనసాగాయి. ఇక నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత ఉంది అంటే..

ఇక నేడు హైదరాబాద్‌లో బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర రూ.54,500 లు పలుకుతుంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి పసిడి రేటు కూడా స్థిరంగానే ఉంది. నేడు 24 క్యారెట్‌ పసిడి పది గ్రాముల ధర రూ.59,450 పలుకుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ బంగారం పది గ్రాముల ధర రూ.54,650 ఉంటే.. 24 క్యారెట్‌ పసిడి ధర రూ.59,990 ల వద్ద ట్రేడవుతోంది.

స్థిరంగా వెండి ధర..

క్రితం రెండు సెషన్లలో భారీగా పెరిగిన వెండి ధర నేడు మాత్రం బంగారం బాటలోనే పయనించింది. నేడు వెండి ధర స్థిరంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో నేడు కిలో వెండి ధర ధర రూ.73,500 లుగా కొనసాగుతోంది. ఇక భాగ్యనగరంలో.. కిలో వెండి ధర నేడు స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో నేడు కిలో వెండి రేటు కిలో వెండి రూ.77 వేల వద్ద ట్రేడవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి