iDreamPost

Gold Price: మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేటు.. నేటి ధర ఎంతుందంటే

  • Published Dec 09, 2023 | 8:29 AMUpdated Dec 09, 2023 | 8:29 AM

క్రితం రెండు సెషన్లలో దిగి వచ్చిన బంగారం ధర నేడు మరోసారి పెరిగి వినియోగదారులకు షాకిచ్చింది. మరి శనివారం నాడు దేశీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

క్రితం రెండు సెషన్లలో దిగి వచ్చిన బంగారం ధర నేడు మరోసారి పెరిగి వినియోగదారులకు షాకిచ్చింది. మరి శనివారం నాడు దేశీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ ధరలు ఎలా ఉన్నాయంటే..

  • Published Dec 09, 2023 | 8:29 AMUpdated Dec 09, 2023 | 8:29 AM
Gold Price: మరోసారి షాకిచ్చిన గోల్డ్ రేటు.. నేటి ధర ఎంతుందంటే

ఈ ఏడాదిలో బంగారం కొనాలనుకునేవారికి ఇప్పట్లో ఊరట లభించే అవకాశం కనుచూపుమేరలో ఎక్కడా కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా పెరుగుతూ పోతున్న గోల్డ్ రేటు.. ఈ ఏడాది గరిష్టాలకు చేరింది. రాకెట్ కన్నా స్పీడ్ గా దూసుకుపోతున్న బంగారం ధర చూసి పసిడి కొనుగోలు చేయాలనుకునేవారు వెనకడుగు వేస్తున్నారు. అటు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా గోల్డ్ రేటు భారీగానే పెరుగుతుంది తప్ప దిగి రావడం లేదు. ఆ ప్రభావం.. దేశీయ బులియన్ మార్కెట్ మీద కూడా ఉంది. ఇక క్రితం సెషన్ లో స్థిరంగా కొనసాగిన పుత్తడి ధర నేడు మాత్రం పెరిగింది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

క్రితం సెషన్ లో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.57,550 వద్ద స్థిరంగా ఉండగా నేడు మాత్రం పెరిగింది. ఇవాళ భాగ్యనగరంలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాముల మీద 150 రూపాయలు పెరిగి.. 57,700 వద్ద అమ్ముడవుతోంది. అలానే క్రితం సెషన్ లో 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల రేటు రూ. 62, 780 వద్ద ట్రేడింగ్ అవ్వగా నేడు మాత్రం పది గ్రాముల మీద రూ.170 పెరిగి 62,950 రూపాయలకు చేరింది.

Gold rate shocked once again

ఇక ఢిల్లీలో కూడా నేడు పసిడి ధర పెరిగింది. హస్తినలో క్రితం సెషన్ లో  22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.57,700 మార్క్ వద్ద అమ్ముడవ్వగా నేడు మాత్రం.. 150 రూపాయలు పెరిగి.. 57,850 రూపాయల వద్ద అమ్ముడవుతోంది. అలానే నేడు ఢిల్లీలో 24  క్యారెట్ స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ. 62 ,930 వద్ద ఉండగా నేడు మాత్రం 170 రూపాయలు పెరిగి.. రూ.63,100 కు చేరింది.

స్థిరంగా వెండి ధర..

నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర పెరగ్గా.. వెండి ధర మాత్రం అందుకు భిన్నంగా స్థిరంగా కొనసాగింది. నేడు దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో సిల్వర్ రేటులో ఎలాంటి మార్పు లేదు. నేడు హైదరాబాద్ లో కిలో వెండి ధర 80 వేల రూపాయల వద్ద స్థిరంగా ఉండగా.. ఢిల్లీలో కూడా 77,200 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. హైదరాబాద్ తో పోలిస్తే.. ఢిల్లీలో వెండి ధర తక్కువగాను.. బంగారం రేటు ఎక్కువగా ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి