iDreamPost

Gold,Silver Rate: పసిడి ప్రియలుకు ఊరట.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే

  • Published Dec 22, 2023 | 8:18 AMUpdated Dec 22, 2023 | 8:18 AM

బంగారం కొనాలనుకునేవారికి నేడు కాస్త ఊరట కలిగింది. క్రితం సెషన్లలో పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. మరి ఇవాళ గోల్డ్ రేటు ఎంత ఉందంటే..

బంగారం కొనాలనుకునేవారికి నేడు కాస్త ఊరట కలిగింది. క్రితం సెషన్లలో పెరిగిన బంగారం ధర నేడు మాత్రం స్థిరంగా ఉంది. మరి ఇవాళ గోల్డ్ రేటు ఎంత ఉందంటే..

  • Published Dec 22, 2023 | 8:18 AMUpdated Dec 22, 2023 | 8:18 AM
Gold,Silver Rate: పసిడి ప్రియలుకు ఊరట.. నేడు బంగారం ధర ఎంత ఉందంటే

బంగారం అంటే భారతీయులకు అభిమానంతో పాటు సెంటిమెంట్ కూడా. పసిడిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇండియన్స్. మన దేశంలో గోల్డ్ అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అక్కరకు ఆదుకునే పెట్టుబడి కూడా. చేతిలో రూపాయి లేకున్నా బంగారం ఉంటే చాలు.. సమస్య నుంచి బయటపడవచ్చు. అందుకే సందర్భం దొరికిన ప్రతి సారి మన వాళ్లు పసిడి కొనుగోలు చేస్తుంటారు. ఇక వివాహాల సీజన్ లో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయి. ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్ లో అదే పరిస్థితి ఉంది. ఇక బంగారానికి డిమాండ్ పెరిగితే.. దానికి తగ్గట్టుగానే ధర కూడా పెరుగుతుంది. మరి నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే..

నేడు అనగా.. శుక్రవారం నాడు.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగినప్పటికీ దేశీయంగా మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఇవాళ మన దేశంలో గోల్డ్ రేటు స్థిరంగా కొనసాగుతోంది. ఇక నేడు హైదరాబాద్‌లో ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ పసిడి ధర స్థిరంగా ఉంది. భాగ్యనరంలో ఇవాళ 22 క్యారెట్ బంగారం పది గ్రాముల ధర రూ. 57,750 మార్కు వద్ద స్థిరంగా కొనసాగుతుంది. అలానే 24 క్యారెట్స్ స్వచ్ఛమైన బంగారం ధర కూడా రూ. 63 వేల వద్ద స్థిరంగా ఉంది.

relax for gold lovers

ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ బంగారం రేటు స్థిరంగా కొనసాగింది. నేడు హస్తినలో 22 క్యారెట్స్ పసిడి పది గ్రాముల ధర రూ. 57,900 వద్ద ఉంది. అలానే 24 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రాముల రేటు రూ. 63,150 వద్ద కొనసాగుతోంది.

భారీగా పెరిగిన వెండి ధర..

నేడు దేశీయ బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగగా.. వెండి ధర మాత్రం భారీగా పెరిగింది.  నేడు ఢిల్లీలో సిల్వర్ రేటు కిలో మీద రూ. 700 పెరిగింది.  ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 79,200 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో కూడా వెండి రేటు పెరిగింది. నేడు భాగ్యనగరంలో సిల్వర్ రేటు కిలో మీద రూ. 500 పెరిగి రూ. 80,700 మార్కు వద్ద అమ్ముడవుతోంది.

ఇక అంతర్జాతీయంగా చూస్తే పసిడి రేట్లు భగ్గుమంటున్నాయి. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2050 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 24.40 డాలర్ల లెవెల్స్ ఎగువన ట్రేడవుతోంది. ఇక బంగారం ధరలు ఇప్పట్లో దిగి వచ్చేలా లేవంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి