iDreamPost

షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

ఇటీవల దేవ వ్యాప్తంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది జ్యూలరీ షాపుల్లో ఖరీదు చేస్తే.. మరికొంతమంది ఆన్ లైన్ లో ఖరీదు చేస్తున్నారు. దీంతో దేశంలో బంగారానికి డిమండ్ భారీగా పెరిగిపోతుంది.

ఇటీవల దేవ వ్యాప్తంగా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయాడానికి ఇష్టపడుతున్నారు. కొంతమంది జ్యూలరీ షాపుల్లో ఖరీదు చేస్తే.. మరికొంతమంది ఆన్ లైన్ లో ఖరీదు చేస్తున్నారు. దీంతో దేశంలో బంగారానికి డిమండ్ భారీగా పెరిగిపోతుంది.

షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంతంటే?

దేశంలో బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది.. బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండదు. ఇటీవల వరుసగా పసిడి ధరలు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఏర్పడుతున్న మార్పుల ప్రభావం బంగారం పై పడుతుందని నిపుణులు అంటున్నారు. వరుస పండుగలు, పెళ్లిళ్ళ సీజన్ కావడంతో పసిడి కొనుగోలు ఎక్కువైంది. గత నెలలో గరిష్టంగా పెరిగిన బంగారం.. ఈ నెలలో కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ అనూహ్యంగా శుక్రవారం దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరిగిపోయాయి. కాకపోతే గతంలో పోల్చుకుంటూ ఇది కాస్త స్వల్పం అని అంటున్నారు వ్యాపారులు. ధరలతో సంబంధం లేకుండా మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జువెలరీ షాపులకు ఎగబడుతున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

బంగారం కోనుగోలు చేసే మహిళలకు ఊహించని షాక్.. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు మరోసారి పెరిగిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.110 పెరిగింది, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 వరకు పెరిగింది. ద్రవ్యోల్భణంతో పాటు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ వడ్డీ రేట్లలో ఏర్పడుతున్న స్వల్ప మార్పుల వల్ల పసిడి ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి బంగారం ధర విషయానికి వస్తే.. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,550 గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,780 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 1000 కి తగ్గి, ప్రస్తుతం రూ.80,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల విషయానికి వస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,700 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,930 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 57,550 గా ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,780 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతా, బెంగళూరులో పసిడి ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పసిడి రూ. 57,550గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి రూ. 62,780 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,200గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 63,490 వద్ద ట్రెండ్ అవుతుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు.. ముంబై, కోల్ కోతా, ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 77,200 వద్ద కొనసాగుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి