iDreamPost

గుడ్ న్యూస్.. భారీగా దిగివస్తున్న గోల్డ్.. ఈ రోజు ఎంతంటే!

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వివాహాది శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు.

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. వివాహాది శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు.

గుడ్ న్యూస్..  భారీగా దిగివస్తున్న గోల్డ్.. ఈ రోజు ఎంతంటే!

గత కొన్నిరోజులుగా బంగారం ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. అప్పుడప్పుడు స్థిరంగా కొనసాగుతుంది. భారత దేశంలో బంగారం కొనుగులో రోజు రోజుకీ పెరిగిపోతుంది. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడానికి జ్యూలరీ షాపులకు క్యూ కడుతున్నారు. దీంతో ఇక్కడ బంగారానికి డిమాండ్ పెరగడంతో పాటు రేట్లు కూడా భారీగానే పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో యూఎస్ డాలర్, ట్రెజరీ ఈల్డ్స్ ఇటీవల పుంజుకుంటున్నాయి.. దీని ప్రభావం బంగారంపై పడుతుందని.. బంగారం విలువ కోల్పోయి ధరలు దిగివస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. నేటి బంగారం, వెండి ధరల విషాయినికి వస్తే..

గత పదిరోజులుగా బంగారం ధరలు ఆకాశాన్నంటాయి. ప్రస్తుతం పెళ్లిళ్ళ సీజన్ కావడంతో బంగారం కొనుగోలు బాగా పెరిగిపోయింది. దీంతో గత నెల నుంచి పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి. కానీ.. రెండు రోజులు నుంచి మాత్రం భారీగా తగ్గడమే కాదు.. స్థిరంగా కొనసాగుతుంది. మహిళలకు గుడ్ న్యూస్.. పసిడి ధరలు మళ్లీ దిగి వచ్చాయి. దీంతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి తరుణం అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లాంటి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,450 గా ఉంది, ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 62,670 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర విషయానికి వస్తే.. రూ.300 వరకు తగ్గి రూ.81,000 వద్ద కొనసాగుతుంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,600 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,820 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో నేడు 22 క్యారెట్ల పసిడి ధర రూ. 58,150 వద్ద ఉండగా, 22 క్యారెట్ల పసిడి ధర రూ. 63,440 వద్ద కొనసాగుతుంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా లో నేటి బంగారం ధరలు 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 57,450 వద్ద ఉంది, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 62,670 వద్ద ట్రెండ్ అవుతుంది. ప్రధాన నగరాల్లో నేటి వెండి ధర విషయానికి వస్తే.. ముంబై, ఢిల్లీ, కోల్‌కొతా లో రూ.78,200 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి