iDreamPost

మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు!

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల ప్రభావం ఎక్కువగా బంగారం పై పడుతుంది. దీంతో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. కానీ దేశంలో మాత్రం ప్రతిరోజూ బంగారం కొనుగోళ్లు మాత్రం ఎక్కువ అవుతున్నాయి.

ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో వస్తున్న మార్పుల ప్రభావం ఎక్కువగా బంగారం పై పడుతుంది. దీంతో బంగారం ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. కానీ దేశంలో మాత్రం ప్రతిరోజూ బంగారం కొనుగోళ్లు మాత్రం ఎక్కువ అవుతున్నాయి.

మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గిన పసిడి ధరలు!

దేశంలో బంగారం కొనుగులు రోజు రోజుకీ పెరిగిపోతుంది. అందుకే దేశీయ మార్కెట్ లో బంగారం దిగుమతి ఎక్కువ అవుతుంది. ఇటీవల బంగారం రేట్లు స్థిరంగా ఎప్పుడో ఒక్కసారి ఉంటున్నాయి.. చాలా వరకు పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. ఈ సమయంలో సామాన్యుల నుంచి సంపన్నుల వరకు బంగారం కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఈ డిమాండ్ కారణంగా బంగారం రేట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. కొద్ది రోజులుగా బంగారం రేట్లు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. గత పదిరోజుల్లోనే ఏకంగా రెండు వేలకు పైగా పెరిగింది. కానీ ఈ రోజు అనూహ్యంగా ఒక్కసారే భారీగా దిగివచ్చింది. ప్రస్తుతం పసిడి, వెండి ధరల విషయానికి వస్తే..

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర 2100 డాలర్ల నుంచి 2020 డాలర్లకు పడిపోయింది. మరోవైపు రూపాయి మారకం విలువ తగ్గిపోతుంది. ప్రస్తుతం డాలర్ తో పోల్చుకుంటే రూపాయి విలు నేడు రూ.83.368 వద్ద కొనసాగుతుంది. నిన్నటి వరకు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు రాకెట్ లా దూసుకుపోయాయి. ఇవాళ హఠాత్తుగా తగ్గుముఖం పట్టాయి. గ్రాముకు వంద అంటే పది గ్రాములకు వెయ్యి రూపాయల మేర తగ్గింది. బంగారం తో పాటు వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి పై ఏకంగా రూ.1000 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్టణంలో నేడు బంగారం ధరలు 22 క్యారెట్ల పసడి ధర రూ. 57,850 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి కిలో ధర రూ. 81,400 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు చూస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,000 గా ఉండగా, 24 క్యారెట్స్ బంగారం ధరల రూ. 63,260 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూలు, కేరళ, భువనేశ్వర్ లో 22 క్యారెట్ల పసడి ధర రూ. 57,850 వద్ద ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 63,110 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగానం ధర రూ. 58,500 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ బంగారం ధర రూ. 63,820 వద్ద ట్రెండ్ అవుతుంది. అహ్మదాబాద్ లో 22 క్యారెట్ పసిడి ధర రూ.57,900 వద్ద ఉండగా, 24 క్యారెట్స్ పసిడి ధర రూ.63,160 వద్ద కొనసాగుతుంది. ఇక ప్రధాన నగరాల్లో కిలో వెండి ధర విషయానికి వస్తే.. ఢిల్లీలో కేజి వెండి ధర రూ. 78,500 ఉండగా, ముంబైలో కిలో వెండి ధర రూ. 59,500, బెంగుళూరు రూ. 79,250 వద్ద ట్రెండ్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి