iDreamPost

పరుగులు పెడుతున్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగింది అంటే

  • Published Sep 20, 2023 | 7:45 AMUpdated Sep 20, 2023 | 7:45 AM
  • Published Sep 20, 2023 | 7:45 AMUpdated Sep 20, 2023 | 7:45 AM
పరుగులు పెడుతున్న బంగారం ధర.. నేడు ఎంత పెరిగింది అంటే

పండగలు, వివాహాది శుభకార్యాలు ప్రారంభం అయ్యాయి.. ఇక బంగారం కొందామనుకునే వారికి భారీ షాకింగ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు. గత కొంత కాలంగా దిగి వచ్చిన పుత్తడి ధర.. ఇప్పుడు మాత్రం బ్రేక్‌ లేకుండా పరుగులు తీస్తుంది. క్రితం సెషన్‌లో గోల్డ్‌ ధర భారీగా పెరిగింది. నేడు అదే రిపీట్‌ అయ్యింది. బుధవారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. సెప్టెంబర్‌ నెల ప్రారంభం నుంచి వరుసగా దిగి వచ్చిన పుత్తడి ధర.. ఈ వారంలో మాత్రం.. ఆగకుండా పరుగులు తీస్తుంది. ఇక నేడు హైదరాబాద్, ఢిల్లీ బులియన్ మార్కెట్లో గోల్డ్, సిల్వర్ ధరలు ఏ విధంగా ఉన్నాయంటే..

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరుగుతూ.. పసిడి ప్రియులకు షాక్‌ ఇస్తోంది. భాగ్యనగరంలో వరుసగా ఐదో రోజు కూడా బంగారం ధర పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల మీద రూ. 150 పెరిగి రూ. 55,200 కు చేరింది. 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా భారీగానే పెరిగింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ పసిడి పది గ్రాముల మీద రూ. 140 పెరిగి.. రూ. 60,220 మార్క్ దాటింది. ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే ఇవాళ 22 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర రూ. 150 పెరిగి రూ. 55,350 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ పసిడి రేటు 10 గ్రాముల మీద రూ. 160 పెరిగి రూ. 60,370 మార్క్ వద్ద అమ్ముడవుతోంది.

పసిడి బాటలోనే సిల్వర్‌..

బంగారం ధర పెరుగుతున్నట్లుగానే వెండి రేటు సైతం పరుగులు పెడుతోంది. నేడు బంగారం ధర మాత్రమే కాక వెండి రేటు కూడా భారీగా పెరిగింది. బుధవారం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ. 100 పెరిగి రూ. 78,300 మార్క్ వద్ద ట్రేడవుతోంది. అలానే దేశ రాజధానిలో కిలో వెండి రేటు రూ. 300 పెరిగి ఇవాళ రూ. 74,800 వద్ద ట్రేడవుతోంది. అటు అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1930 డాలర్లు పలుకుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.14 డాలర్లు ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి