iDreamPost

సంక్రాంతి పండుగ సంతోషంలో ఉండగానే..విషాదం!

జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఠపీమంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండే వేళ విషాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ బాలిక విషయంలో అదే జరిగింది. సంక్రాంతి పండుగ సంతోషంలో ఉండగానే ఆ బాలిక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

జీవితం నీటి బుడగ లాంటింది. ఎప్పుడు ఠపీమంటుందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో సంతోషంగా ఉండే వేళ విషాదాలు చోటుచేసుకుంటాయి. తాజాగా ఓ బాలిక విషయంలో అదే జరిగింది. సంక్రాంతి పండుగ సంతోషంలో ఉండగానే ఆ బాలిక కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.

సంక్రాంతి పండుగ సంతోషంలో ఉండగానే..విషాదం!

మనిషి జీవితంలో ఎప్పుడు ఎలాంటి ఘటనలు చోటుచేసుకుంటాయో ఎవ్వరం చెప్పలేము. కాసేపటి క్రితం వరకు ఎంతో చక్కగా కనిపించే వారు.. క్షణాల్లో విగత జీవిగా మారిపోతున్న ఘటనలు అనేకం ఉన్నాయి. అలానే కొందరు కుటుంబంతో ఎంతో సంతోషంగా గడిపి.. మరుక్షణమే నిర్జీవిగా మారిపోతున్నారు. తాజాగా ఓ బాలిక విషయంలో అదే చోటుచేసుకుంది. విధి ఆడిన వింత నాటకంలో ఆ బాలిక తిరిగిరాని లోకాలకు వెళ్లింది. సంక్రాంతి పండగ సంతోషం మరువక ముందే ఆ బాలిక ఇంట విషాదం చోటుచేసుకుంది. అసలు ఏం జరిగింది. ఎక్కడ జరిగింది. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో విషాదం చోటుచేసుకుంది. పీఏపల్లి మండలం అంగడిపేట స్టేజీకి చెందిన దాసరి ఆంజనేయులు, అండాళ్ల దంపతులు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు భార్గవి(14)అనే కుమార్తె ఉంది.  తమ బిడ్డను ఆంజనేయుల దంపతులు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. ప్రస్తుతం భార్గవి కొండమల్లేపల్లి ఎస్సీ గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కొన్ని రోజుల క్రితం సంక్రాంతి పండుగ కోసం ఇంటికి వెళ్లింది. అక్కడ కుటుంబ సభ్యులతో ఎంతో సంతోషంగా గడిపింది. ఇక సంక్రాంతి పండగ సెలవు ముగియడంతో ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి తిరిగి పాఠశాలకు వచ్చింది.

పండగ వేళ ఇంటి దగ్గర జరిగిన విశేషాలను తోటి స్నేహితులతో పంచుకుంది. సోమవారం ఉదయం పాఠశాల ప్రార్థన కార్యక్రమంలో భార్గవి పాల్గొంది. ప్రార్థనలో నిల్చొన్న ఆ బాలిక ఒక్కసారిగా కళ్లు తిరిగి కిందపడింది. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది భార్గవిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అందించి అనంతరం దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే బాలిక ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఇలా అకస్మాతుగా విద్యార్థిని మృతి చెందడంతో గుండెపోటా లేదా ఇతర అనారోగ్య కారణమా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే విద్యార్థిని మృతదేహం పసుపు రంగులోకి మారడంతో భార్గవి మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని మృతురాలి తండ్రి ఆంజనేయులు అన్నారు.

మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దాసరి భార్గవి మృతి చెందడంతో సోమవారం దేవరకొండ ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆసుపత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. విద్యార్థి మృతిపై దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్‌ బాలునాయక్‌ సోమవారం సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. గురుకుల సంస్థ నుంచి ఆర్థిక సాయాన్నిఅందిస్తామని ఎస్సీ గురుకుల పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి