iDreamPost

ఘోర ప్రమాదం: పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 40 మంది దుర్మరణం!

ఏదైనా లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైతే జనం ఎగబడుతుంటారు. అయితే దాని మాటున పొంచి ఉన్న ప్రమాాదాన్ని గుర్తించలేక పోతున్నారు. అలా ప్రమాదాని పసిగట్టలేక.. 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఏదైనా లోడ్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైతే జనం ఎగబడుతుంటారు. అయితే దాని మాటున పొంచి ఉన్న ప్రమాాదాన్ని గుర్తించలేక పోతున్నారు. అలా ప్రమాదాని పసిగట్టలేక.. 40 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఘోర ప్రమాదం: పేలిన పెట్రోల్ ట్యాంకర్.. 40 మంది దుర్మరణం!

మనం నిత్యం అనేక రోడ్డు ప్రమాదాలు చూస్తేనే ఉంటాము. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలా జరిగే ప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక కొన్ని సందర్భాల్లో పెట్రోల, డీజిల్, గ్యాస్ వంటి వాటిని తీసుకెళ్లే వాహనం ప్రమాదానికి గురైతే.. స్థానికులు ఎగబడుతుంటారు. ఈ క్రమంలో అవి పేలిపోయి ఘోర ప్రమాదం సంభవిస్తుంది. గతంలో పాకిస్థాన్ లో అలా పెట్రోల్ కోసం జనం ఎగబడి.. అది పేలడంతో వంద మంది చనిపోయారు. తాజాగా అలాంటి ఘటనే  ఓ ప్రాంతంలో చోటుచేసుకుంది.  మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

చాలా మంది జనం ఫ్రీగా వస్తే.. ఫినాయిల్  కూడా వదిలేలా కనిపించడం లేదు. అయితే దారుణంగా తాము ప్రమాదంలో ఉన్నామని తెలిసి కూడా..ఫ్రీగా వచ్చే వస్తువుల కోసం ఎగబడుతుంటారు. పెట్రోల్, గ్యాస్ లను తరలించే వాహనాలు ప్రమాదానికి గురైతే.. వాటిని తీసుకునేందుకు జనాలు ఎగబడుతుంటారు. ఈ క్రమంలో జరిగే అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోతుంటారు. అలాంటి ఘటన లైబీరియాలో చోటుచేసుకుంది.

Exploded petrol tanker

లైబీరియాలోని టొటొటా పట్టణంలో  పెట్రోల్ తో వెళ్తున్న లారీ ప్రమాదానికి గురైంది. అనంతరం అందులో నుంచి పెట్రోల్  భారీగా లీక్ అయ్యింది.  ఆ పెట్రోల్ ను పట్టుకునేందుకు స్థానిక జనం పెద్ద ఎత్తున ఎగబడ్డారు. చాలా మంది ఇంట్లోని బకెట్లు, ఇతర వస్తువులను తీసుకొచ్చి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎలా జరిగిందో కానీ..  ఆ పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలింది. దీంతో దాని కోసం ఎగబడిన జనంలో 40 మంది  దుర్మరణం చెందారు. అంతేకాక 88 మందికి గాయాలయ్యాయి. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు  వెల్లడించారు.. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా.. దాన్ని పట్టుకునేందుకు జనం ఎగబడ్డటంతో ఈ భారీ ప్రాణ నష్టం జరిగింది.

ఈఘటనలో చాలా మంది గాయపడగా, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈఘటన జరుగుతుండగా స్థానికలు ఒకరు వీడియో సైతం తీశారు. ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధిచిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఉచితంగా వస్తుందని వెళ్లి.. ప్రాణాలే కోల్పోవడం బాధరకరం అంటు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఇలాంటి చర్యలకు దిగకూడదని.. ప్రమాదం జరిగినప్పుడు అధికారులకు చెప్పడం ఉత్తమమని మరికొందరు అంటున్నారు. మరి.. ఇలా జనం కావాల్సి మృతువు  ఒడిలోకి వెళ్లిన ఘటనలు అనేకం జరిగాయి. ఇలా ఉచితం కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోతున్న పౌరులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి