iDreamPost

కరీంనగర్‌లో భారీ అగ్నిప్రమాదం.. పేలిన 10 సిలిండర్లు!

Karimnagar: ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కారణం ఏదైనప్పటికీ ఈ ఘటనల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతోంది. తాజాగా కరీంనగర్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 10 గ్యాస్ సిలిండర్లు పేలాయి.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. రసాయనాల పేలుడు, షార్ట్ సర్య్కూట్ వంటి వివిధ కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఈ అగ్నిప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాక ఈ ప్రమాదాల కారణంగా భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ లో నాంపల్లిలోని ఓ భవనంలో జరిగిన ప్రమాదంలో తొమ్మింది మంది మరణించారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.

కరీంనగర్ పట్టణంలోని ఆదర్శ్ నగర్  కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అక్కడ ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో ఆ తరువాత పరిసల ప్రాంతాలకు వ్యాపించింది. ఓ గుడిసెలోని దేవుడి దీపం అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దేవుడి దీపం అంటుకోవడంతో గుడిసె దగ్ధమైంది. ఆ ఇంటి నుంచి భారీగా మంటలు చెలరేగడమే కాకుండా.. చుట్టు ఉన్న 20 గుడిసెలకు కూడ వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 10 గ్యాస్ సిలిండర్లు పేలాయి. ఆ ఇళ్లల్లో ఎవరు లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సమచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి