iDreamPost

పిల్లలు పుట్టాక కూడా అందంగా లేదంటూ సౌందర్యపై..

పిల్లలు పుట్టాక కూడా అందంగా లేదంటూ సౌందర్యపై..

నేటి సమాజం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. అలానే ఆడ వాళ్లు సైతం అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇలాంటి ఆధునిక యుగంలో కూడ ఆడవారిపై వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా గృహిణీలను భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేస్తున్నారు. వారి వేధింపులను భరించలేక కొందరు ఎదిరిస్తుంటే, మరికొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్లైనప్పటి నుంచి అందంగా లేవంటూ భర్త అవమానించడంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సిద్ధిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న, దుర్గమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం బన్సీలాల్‌పేట పరిధిలోని జీవైఆర్‌ కాంపౌండ్‌ లోని రెండు పడకల కాలనీలో ఉంటున్నారు. వేమన్న దంపతులకు నలుగురు కుమార్తెలు. ఓ ప్రైవేటు కంపెనీలు ఉద్యోగం చేస్తూ పిల్లలను పెంచి పెద్ద చేశాడు. అలానే నలుగురు  పిల్లలకు ఉన్నంతలో ఘనంగా వివాహం  చేశారు. మూడేళ్లక్రితం చిన్నకూతురు సౌందర్య(26)ను సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ.2.5 లక్షల నగదు, 4 తులాల బంగారం ఇచ్చారు.

గణేష్‌, సౌందర్యలు ఉప్పల్‌ డివిజన్ లోని భరత్‌నగర్‌లో నివాముంటున్నారు. గణేశ్ పద్మారావు నగర్ లోని ఓ క్షౌరశాలలో పని చేస్తున్నాడు. పెళ్లైన కొంతకాలం వరకు ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆతరువాత కొంతకాలానికి అదనపు కట్నం తీసుకురమ్మంటూ గణేశ్ .. భార్యను వేధించ సాగాడు. ఈక్రమంలోనే ఏడాదిన్నర క్రితం సౌందర్య కవలలకు జన్మనిచ్చించింది. పిల్లలు పుట్టిన కూడా గణేశ్ లో వేధింపులు ఆగలేదు. అప్పుడప్పుడు సౌందర్య పుట్టింటి నుంచి సొమ్ము తీసుకొచ్చినా గణేశ్ లో మార్పు రాలేదు. ఇంకా దారుణం ఏమిటంటే పిల్లలు పుట్టాగా అందంగా లేవంటూ హింసించేవాడు. దీంతో 25 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. అతని వేధింపులు తట్టుకోలేక  కుటుంబ సభ్యులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పనిచేస్తున్న పద్మారావునగర్‌లోని సెలూన్ షాప్ కి వెళ్లిన సౌందర్య.. తనను తీసుకెళ్లాలంటూ భర్తను కోరింది. అయినా అతడు సౌందర్య మాటలను  వినలేదు. దాంతో బన్సీలాల్‌ పేటకు తిరిగొచ్చి.. ఇద్దరు పిల్లలతో 8వ అంతస్తు పైకి వెళ్లి.. దూకింది. తొలుత పిల్లలను కిందకు తోసేసి, ఆ తరువాత ఆమె కూడా దూకేసింది. దీంతో తల్లీ బిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి.. నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబాన్ని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ పరామర్శించారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి