iDreamPost

Bengaluru: ఫోటో షూట్ వద్దన్న తల్లిదండ్రులు.. యువతి తీవ్ర నిర్ణయం!

ఇటీవల జనాలు చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాను. బంగారం లాంటి భవిష్యత్ ఉన్నా.. బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.

ఇటీవల జనాలు చిన్న విషయాలకే మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాను. బంగారం లాంటి భవిష్యత్ ఉన్నా.. బలవన్మరణాలకు పాల్పపడుతున్నారు.

Bengaluru: ఫోటో షూట్ వద్దన్న తల్లిదండ్రులు.. యువతి తీవ్ర నిర్ణయం!

ఈ మద్యకాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి మనస్థాపానికి గురై దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొంతమంది క్షణికావేశంలో ఎదుటివారిపై దారుణంగా దాడులు చేయడం, మరికొందరు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తున్నారు. అలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. ఎక్కువగా పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో కారణాల వల్ల బలవన్మరణానికి పాల్పపడుతున్నారు. ఇటీవల విద్యార్థులు చదువులో రాణించలేకపోతున్నామని, తల్లిదండ్రులు తమకు ఇష్టమైన పనికి అడ్డు చెబుతున్నారని మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు తన ఇష్టాన్ని కాదన్నారని ఓ యువతి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

బెంగుళూరు సుధామనగర్ లో సోమవారం షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వర్షిణి (21) అనే యువతి సుధామనగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ప్రస్తుతం బీబీఏ చదువుతున్న వర్షిణి దానితో పాటు ఫోటో గ్రఫీ కోర్సు కూడా చేస్తుంది. చిన్నప్పటి నుంచి వర్షిణిని గారాబంగా చూసుకుంటున్నారు తల్లిదండ్రులు. తన ఇష్టాన్ని ఎప్పుడూ కాదనకుండా పెంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సరం సందర్భంగా ఫోటో షూట్ కోసం వెళ్లేందుకు సిద్దమైంది. అయితే తల్లిదండ్రుల ఎక్కువ క్రౌడ్ ఉంది.. ఇబ్బందులు ఏర్పడతాయి అని వర్షిణితో చెప్పారు. తన ఫ్రెండ్ అంతా ఎదురు చూస్తున్నారు.. కొత్త సంవత్సరం తనకు ఎందుకు అడ్డు చెబుతున్నారని తల్లిదండ్రులతో గొడవ పెట్టుకుంది వర్షిణి.

Parents who don't want a photo shoot

ప్రస్తుతం బయట పరిస్థితులు బాగాలేవు.. కొత్త సంవత్సరం వేడుకల్లో గొడవలు జరుగుతుంటాయి వెళ్లవొద్దని వర్షిణి తల్లిదండ్రులు వారించారు. తనకు ఇష్టమైన పని చేయకుండా అడ్డు చెబుతున్న తల్లిదండ్రులపై అలిగి కోపంగా తన రూమ్ లోకి వెళ్లిపోయింది వర్షిణి. మనస్థాపంతో క్షణికావేశంలో దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఫ్యాన్ కి ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. మరుసటి రోజు తమ కూతురు ఎంతకీ బయటకు రాకపోవడంతో తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. దీంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కూతురుని శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. అందరితో సంతోషంగా ఉండే వర్షిణి కన్నుమూయడంతో స్థానికులు, స్నేహితులు దుఖఃసాగరంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి