iDreamPost

ఖాతా తెరిచిన బీజేపీ, కాంగ్రెస్

ఖాతా తెరిచిన బీజేపీ, కాంగ్రెస్

గోవాలో బీజేపీ, కాంగ్రెస్‌లు ఖాతా తెరిచాయి. బీజేపీ రెండు చోట్ల, కాంగ్రెస్‌ ఒక చోట విజయం సాధించాయి. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య పోటీ హోరాహోరీగా సాగుతోంది. తొలిసారి పోటీచేసిన టీఎంసీ కూటమి కూడా తన ప్రాభల్యాన్ని చాటుకుంటోంది. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ స్పష్టమైన మెజారిటీ దిశగా వెళుతోంది. పంజాబ్‌లో ఆప్‌ దూసుకెళుతోంది. ఆ పార్టీకి దరిదాపుల్లో మరే పార్టీ లేదు. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళుతోంది. మిజోరంలో హంగ్‌ ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి.

పంజాబ్‌లో మొత్తం 117 స్థానాలకు గానూ ఇప్పటికే 89కు పైగా స్థానాల్లో ఆప్‌ ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది. శిరోమణి అకాలిదల్‌ 11 చోట్ల, బీజేపీ కూటమి, ఇతర పార్టీలు 6 స్థానాల్లోనూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో ఊహించిన విధంగానే బీజేపీ దూసుకు వెళుతోంది. 403 సీట్లకు గాను బీజేపీ 268, ఎస్పీ 120, బీఎస్పీ 6, కాంగ్రెస్‌ పార్టీ 3 స్థానాల్లో, ఇతర పార్టీలు 5 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు దాదాపు అన్ని చోట్లా లెక్కింపు మొదలైంది. బీజేపీ 45 చోట్ల, కాంగ్రెస్‌ పార్టీ 22, ఇతర పార్టీలు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

గోవాలో మొత్తం 40 స్థానాలు ఉండగా.. బీజేపీ రెండు చోట్ల విజయం సాధించింది. మరో16 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఒక చోట గెలిచింది,11 సీట్లలో ముందంజలో ఉంది. టీఎంసీ కూటమి 5 స్థానాల్లోనూ, ఆప్ ఒక చోట, ఇతర పార్టీలు నాలుగుచోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

మణిపూర్‌లో మొత్తం 60 స్థానాలు ఉండగా. బీజేపీ 25 చోట్ల ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్‌ 12 స్థానాల్లోనూ, ఎన్‌పీపీ 10, ఇతర పార్టీలు 13 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి