iDreamPost

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న టైగర్‌ నాగేశ్వరరావు!

మాస్‌ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా సూపర్‌ హిట్‌ అయిన సంగతి తెలిసిందే. ప్యాన్‌ ఇండియా చిత్రంగా విడుదలై అన్ని ప్రాంతాల ప్రేక్షకుల్ని అలరించింది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న టైగర్‌ నాగేశ్వరరావు!

ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌ హీరో అయ్యారు మాస్‌ మహారాజా రవితేజ. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌ కొనసాగుతోంది. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ.. వారి జీవితాల్లో కూడా రియల్‌ హీరో అవుతున్నారు. రవితేజ తాజాగా ‘ టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ప్యాన్‌ ఇండియా సినిమాగా రిలీజైంది. అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అన్ని భాషల్లోనూ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

ఇక, ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించి కొద్దిరోజుల క్రితమే అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్‌ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం నవంబర్‌ 17(ఈ రోజు) నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతూ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతూ ఉంది. హిందీలో మాత్రం ఇంకా స్ట్రీమింగ్‌ అవ్వటం లేదు. కాగా, ఈ సినిమాలో రవితేజ సరసన నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ నటించారు. రేణు దేశాయ్‌, అనుపమ్‌ ఖేర్‌ తదితరులు కీలక పాత్రలు చేశారు.

టైగర్‌ నాగేశ్వరరావు కథ ఏంటంటే.. 

టైగర్‌ నాగేశ్వరరావు నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కింది. దేశ వ్యాప్తంగా ప్రాచూర్యం పొందిన గజదొంగ ‘ టైగర్‌ నాగేశ్వరరావు’ జీవితాన్ని దర్శకుడు వంశీ సినిమాగా తీశారు. టైగర్‌ నాగేశ్వరరావు వల్ల ప్రధానమంత్రికి ప్రమాదం ఉందని తెలుస్తుంది. టైగర్‌ నాగేశ్వరరావు ఎవరో తెలుసుకోవటానికి విశ్వనాథ శర్మ(మురళీ శర్మ) అనే గుంటూరు సీఐని ఢిల్లీ పిలిపిస్తారు. నాగేశ్వరరావు అంటే ఎవరో తెలుసుకుంటారు. బాపట్ల, చీరాల, స్టువర్టుపురం ఏరియాలను టైగర్ రేంజ్ అని పిలస్తుంటారు. అక్కడ టైగర్ నాగేశ్వరరావు ఉంటాడన్న కారణంగా దాన్ని ఆ పేరుతో పిలుస్తుంటారు. చెప్పి దొంగతనాలు చేయడం నాగేశ్వరరావు స్టైల్. నాగేశ్వరరావు పేరు వినగానే పోలీసులు,

ప్రభుత్వానికి వెన్నులో వణుకుపుడుతుంది. అతడు దేశంలో పెద్ద క్రిమినల్‌ అన్న సంగతి ఢిల్లీ వరకు వెళుతుంది. కానీ, స్టువర్టుపురం ప్రజలు మాత్రం నాగేశ్వరరావును దేవుడి కంటే ఎక్కువగా భావిస్తుంటారు. ఇంతకీ అతడు ఆ ప్రజలకు చేసిన మంచి ఏంటి? ఆ ఒక్కడు పోలీసులు, ప్రభుత్వాన్ని ఎలా భయపెడుతున్నాడు? ప్రధానికి అతడి వల్ల ప్రమాదం ఎంటి? ఎందుకు స్టువర్టుపురం వాళ్లు సామాన్య ప్రజల్లా జీవిచడం లేదు? అన్నదే మిగితా స్టోరీ.. అయితే, రియల్‌గా జరిగిన దానికి సినిమాలో కథకు చాలా మార్పులు చేశారు. మరి, టైగర్‌ నాగేశ్వరరావు ఓటీటీ రిలీజ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.