iDreamPost

Ticket Prices : టికెట్ రేట్ల సమస్య కొలిక్కి

మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ కేంద్రాలకు ఎలాంటి రేట్లు ఉండాలి, అదనపు షోలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇందాక ఇచ్చిన ఉత్తర్వు మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. భీమ్లా నాయక్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకోవడంతో దీని వల్ల వచ్చే లాభం ఆ సినిమాకు ఉండకపోవచ్చు.

మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ కేంద్రాలకు ఎలాంటి రేట్లు ఉండాలి, అదనపు షోలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇందాక ఇచ్చిన ఉత్తర్వు మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. భీమ్లా నాయక్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకోవడంతో దీని వల్ల వచ్చే లాభం ఆ సినిమాకు ఉండకపోవచ్చు.

Ticket Prices : టికెట్ రేట్ల సమస్య కొలిక్కి

నెలల తరబడి టాలీవుడ్ చేస్తున్న ఎదురు చూపులకు ఫలితం దక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జిఓని విడుదల చేసింది. మున్సిపల్ కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ కేంద్రాలకు ఎలాంటి రేట్లు ఉండాలి, అదనపు షోలకు సంబంధించి పూర్తి వివరాలతో ఇందాక ఇచ్చిన ఉత్తర్వు మీద అప్పుడే చర్చలు మొదలయ్యాయి. భీమ్లా నాయక్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకోవడంతో దీని వల్ల వచ్చే లాభం ఆ సినిమాకు ఉండకపోవచ్చు. ఎలాగూ శుక్రవారం రాధే శ్యామ్ రానుంది కాబట్టి ఈ జిఓ నుంచి కలిగే ప్రయోజనం ప్రభాస్ మూవీకి అందనుంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో ఏర్పడ్డ ప్రతిష్టంభన తొలగిపోయి వసూళ్లు మెరుగవుతాయి.

ఏపిలో ఇరవై శాతం షూటింగ్ జరుపుకునే వాటికి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వడం, అయిదు షోలకు పర్మిషన్లు ఇస్తూనే అందులో ఒకటి చిన్న సినిమా ఉండాలన్న నిబంధన పెట్టడం ఇవన్నీ పలు మార్పులకు దారి తీయనున్నాయి. హీరో హీరోయిన్లు తదితర ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు మినహాయించి ఒకవేళ బడ్జెట్ కనక వంద కోట్లు దాటితే కమిటీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి వెసులుబాటు కలిగించనున్నారు. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ లు ఎప్పుడో పూర్తయినవి కాబట్టి వాటికి స్పెషల్ ఎగ్జంప్షన్ ఇవ్వడం డిస్ట్రిబ్యూటర్లకు ఊరట కలిగించనుంది. గ్రామాల్లో ఏసి థియేటర్ కు గరిష్టంగా 70 రూపాయలు ధరను డిసైడ్ చేయడం కలెక్షన్లను పెంచుతుంది.

ఇకపై నుంచి వచ్చే సినిమాల వసూళ్లు ఈ పరిణామాల వల్ల ఏ విధంగా లాభపడనున్నాయనేది వేచి చూడాలి. రాధే శ్యామ్, ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా మూవీస్ వస్తున్న తరుణంలో ఇప్పుడిది అత్యవసరంగా పరిగణించాల్సిన అంశమే. ఇవే కాదు రాబోయే రోజుల్లో ఆచార్య, కెజిఎఫ్ 2, ఎఫ్3, బీస్ట్, సర్కారు వారి పాట, మేజర్ లాంటివి చాలానే క్యూ కట్టాయి. పలు వాయిదాల తర్వాత రిలీజ్ అవుతుండటంతో ఆర్థికంగానూ అడ్వాంటేజ్ అవుతుంది. మొత్తానికి సమస్య పరిష్కారం అయ్యింది కాబట్టి బాక్సాఫీస్ వద్ద సందడి కొత్త రూపం సంతరించుకోనుంది. బిగ్ బడ్జెట్ సినిమాలకు ఇకపై క్లియర్ డెఫినెషన్ ఇచ్చుకోవాలి. ఇదీ ఒకందుకు మంచిదే

Also Read : Alia Bhatt : మహేష్ తారక్ ఇద్దరి సరసన ఆఫర్లా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి