iDreamPost

వాహనదారులకు అలర్ట్!.. ఆ కార్లు వాడితే రూ. 20 వేల జరిమానా!

రాష్ట్రా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ కార్లను వాడితే జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. పొరపాటున మీరు ఆ కార్లను వాడినట్లైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

రాష్ట్రా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ కార్లను వాడితే జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. పొరపాటున మీరు ఆ కార్లను వాడినట్లైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

వాహనదారులకు అలర్ట్!.. ఆ కార్లు వాడితే రూ. 20 వేల జరిమానా!

ఈ మధ్య కార్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కరోనా మహమ్మారి అనంతరం వ్యక్తిగత వాహనాలను వాడేందుకే జనాలు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో కార్లు కలిగిన వాహనదారులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఆ రాష్ట్రా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆ కార్లను వాడితే జరిమానా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించింది. పొరపాటున మీరు ఆ కార్లను వాడినట్లైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకీ ఏ కార్లు? ఎందుకు జరిమానా విధిస్తారు? ఈ నిబంధనలు ఏ రాష్ట్రానికి సంబంధించినవి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దేశ రాజధానిలో వాయు కాలుష్యం కోరలు చాస్తోంది. ఢిల్లీలోని ప్రజలు ఊపిరిపీల్చుకోలేని పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తీవ్రమైన వాయుకాలుష్యంతో శ్వాస సంబంధమైన వ్యాధుల భారిన పడుతున్నారు అక్కడి ప్రజలు. ఈ నేపథ్యంలో అక్కడి రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పెట్రోల్, డీజిల్ తో నడిచే కార్లపై నిషేదం విధించింది. ఢిల్లీలో నేటి నుంచి తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ ఇంజిన్‌లతో నడిచే వాహనాలపై నిషేధం విధిస్తూ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై ఆ కార్లను నడిపే వారికి రూ.20,000 జరిమానా విధించనున్నారు. అయితే ఇందులో ప్రభుత్వ వాహనాలకు, పోలీస్ వాహనాలకు, అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వాహనాలకు మినహాయింపునిచ్చారు.

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) ఫేజ్ 3 కింద ఉన్న చర్యలను అమలు చేశారు. ముండ్కాలో, AQI నవంబర్ 2న గరిష్టంగా 835కి చేరుకుంది. ఇతర ప్రాంతాలలో కూడా AQI 600, 500 కంటే ఎక్కువగా నమోదైంది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు కాకుండా, అన్ని రకాల నిర్మాణ కార్యకలాపాలపై నిషేదం విధించింది. చీపుర్లతో రోడ్లు శుభ్రం చేయకుండా ఉండడం, క్రమం తప్పకుండా రోడ్లపై నీరు చల్లడం చేయనున్నారు. ఇటుక బట్టీలు, పారిశ్రామిక యూనిట్లు, థర్మల్ పవర్ ప్లాంట్‌ల ఆంక్షలు విధించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి