iDreamPost

ఈ వారం OTTలోకి 16 సినిమాలు.. ఎందులో ఏ మూవీ అంటే?

OTT And Theatre Releases: ఈ వారం సినిమా లవర్స్ జాతర అనే చెప్పాలి. ఎందుకంటే థియేటర్స్, ఓటీటీలో కలిపి మొత్తం 20 సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి.. ఆ మూవీస్ ఏవి? ఎలా ఉండబోతున్నాయి?

OTT And Theatre Releases: ఈ వారం సినిమా లవర్స్ జాతర అనే చెప్పాలి. ఎందుకంటే థియేటర్స్, ఓటీటీలో కలిపి మొత్తం 20 సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరి.. ఆ మూవీస్ ఏవి? ఎలా ఉండబోతున్నాయి?

ఈ వారం OTTలోకి 16 సినిమాలు.. ఎందులో ఏ మూవీ అంటే?

ప్రస్తుతం ఓటీటీలోకి వారానికి పదికి పైగానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే థియేటర్లలో కూడా ఒక్కో నెలలో 3 సినిమాల వరకు రిలీజ్ అవుతున్నాయి. కానీ, ఈసారి ఓటీటీ, థియేటర్లలో సినిమాల జాతర ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈవారం థియేటర్లలో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ జానర్స్ లో 4 అదిరిపోయే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అలాగే మరోవైపు ఓటీటీలో 16 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి.. ఈ వారం సినిమాల జాతర అనాల్సిందేగా? మరి.. థియేటర్లలో ఏఏ సినిమాలు విడుదల కాబోతున్నాయి? వాటిలో ఏ మూవీ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలబోతోంది? ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల సంగతి ఏంటో పూర్తి వివరాలు తెలియాలంటే ఈ ఆర్టికల్ చదివేయండి.

థియేటర్ రిలీజెస్:

ఈ వారం థియేటర్లలో అదిరిపోయే సినిమాలు విడుదల కాబోతున్నాయి. మార్చి 28న పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాని ఏకంగా 16 ఏళ్లు షూట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీ పృథ్వీ లైఫ్ లో ఒక గొప్ప చిత్రం అవుతుంది అంటున్నారు. మార్చి 29న తెలుగు రాష్ట్రాల యువత ఎంతగానో ఎదురుచూస్తున్న టిల్లు స్క్వేర్ విడుదల కాబోతోంది. ప్రస్తుతం రిలీజ్ అవుతున్న చిత్రాల్లో ఈ టిల్లు స్క్వేర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ రూ.35 కోట్లు జరిగింది అంటున్నారు. ఇంక మార్చి 29న గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ విడుదల కాబోతోంది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీపై భారీగానే అంచనాలు ఉన్నాయి. టిల్లు సినిమాకి ఈ మూవీ గండం ఉంది అని కూడా అంటున్నారు. ఇంక మార్చి 29నే కలియుగ పట్టణం  అనే సినిమా కూడా విడుదల కాబోతోంది. మొత్తానికి ఈ వారం థియేటర్లలో మొత్తం 4 సినిమాలు విడుదల అవుతున్నాయి.

నెట్ ఫ్లిక్స్:

  • టెస్టామెంట్(వెబ్ సిరీస్)- మార్చి 27
  • రోంజా ది రాబర్ట్ డాటర్(వెబ్ సిరీస్)- మార్చి 28
  • ది బాక్స్ టర్స్(వెబ్ సిరీస్)- మార్చి 28
  • ది బ్యూటిఫుల్ గేమ్- మార్చి 29
  • హార్ట్ ఆఫ్ ది హంటర్- మార్చి 29
  • ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో- మార్చి 30

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

  • ట్రూ లవర్- మార్చి 27
  • మధు(డాక్యుమెంటరీ)- మార్చి 29
  • పట్నా శుక్లా(హిందీ సినిమా)- మార్చి 29
  • రెనెగడె నెల్ల్(సిరీస్)- మార్చి 29
  • ది బ్యూటిఫుల్ గేమ్- మార్చి 29

అమెజాన్ ప్రైమ్:

  • టిగ్ నొటారో(సిరీస్)- మార్చి 26
  • ది బాక్స్ టర్స్(వెబ్ సిరీస్)- మార్చి 28
  • ఇన్ స్పెక్టర్ రిషి(వెబ్ సిరీస్)- మార్చి 29
  • జియో సినిమా: ఏ జెంటిల్ మ్యాన్ ఇన్ మాస్క్ వెబ్ సిరీస్- మార్చి 29
  • బుక్ మై షో: ది హోల్డోవర్స్- మార్చి 29

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి