iDreamPost

Ratha Saptami 2024: ఫిబ్రవరి 16 రథసప్తమి.. ఈ పర్వదినాన ఏం చేయాలి?

ప్రకృతి మన కోసం ఎంతో మేలు చేస్తుంది. కృతజ్ఞతగా ఆ ప్రకృతిని ఆరాధించడం అనేది మన సంప్రదాయం. ప్రకృతిలో భాగమైన.. ప్రకృతికే ఆధారమైన.. ప్రకృతితో పాటు సమస్త జీవరాశులకు అవసరమైన ఆ సూర్యభగవానుడి జయంతినే రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. మరి రథ సప్తమి నాడు చేయవలసిన పనులు ఏమిటి?

ప్రకృతి మన కోసం ఎంతో మేలు చేస్తుంది. కృతజ్ఞతగా ఆ ప్రకృతిని ఆరాధించడం అనేది మన సంప్రదాయం. ప్రకృతిలో భాగమైన.. ప్రకృతికే ఆధారమైన.. ప్రకృతితో పాటు సమస్త జీవరాశులకు అవసరమైన ఆ సూర్యభగవానుడి జయంతినే రథ సప్తమిగా జరుపుకుంటారు. ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి 16న వచ్చింది. మరి రథ సప్తమి నాడు చేయవలసిన పనులు ఏమిటి?

Ratha Saptami 2024: ఫిబ్రవరి 16 రథసప్తమి.. ఈ పర్వదినాన ఏం చేయాలి?

భూమిపై ఉండే సమస్త జీవరాశులకు ఆ సూర్యభగవానుడే ఆధారం. ఈ కారణంగానే సూర్యుడిని కనిపించే దైవంగా భావిస్తారు. సూర్యుడిని అన్నదాతగా, ఆరోగ్య ప్రదాతగా కొలుస్తారు. మన హిందూ సంప్రదాయం ప్రకారం సూర్యారాధనకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా సూర్య జయంతి అనగా రథసప్తమి నాడు సూర్యుడ్ని ప్రత్యేకించి పూజిస్తారు. మాఘ మాసంలోని శుక్ల పక్షంలో సప్తమి తిథిని రథసప్తమిగా పరిగణించి సూర్యభగవానుడిని ఆరాధిస్తారు. సూర్యుడు జన్మించింది ఈరోజే కాబట్టి సూర్య జయంతి అని.. ఏడు గుర్రాలపై సంచరిస్తాడు కాబట్టి రథ సప్తమి అని అంటారు.

సూర్యుడు ఏడు గుర్రాల రథం మీద దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ ప్రయాణం రథసప్తమి రోజునే మొదలవుతుంది కాబట్టి ఈ రోజున పర్వదినంగా భావిస్తారు. మాఘ మాసంలో వచ్చే ఈ సప్తమి నుంచి వచ్చే ఆరు నెలలు ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. అందుకే ఈరోజున ఉదయాన్నే లేచి జిల్లేడు ఆకులతో స్నానం చేస్తే మంచిది. తల, మెడ, భుజాలు, హృదయం మీద జిల్లేడు ఆకులను ఉంచుకుని స్నానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు.

జిల్లేడు ఆకులను అర్కపత్రాలు అని కూడా అంటారు. అర్కః అంటే సూర్యుడు అని అర్థం. అర్క పత్రాలకు సూర్యశక్తిని గ్రహించే శక్తి అధికంగా ఉంటుంది. ఆ శక్తిని శిరస్సులోని బ్రహ్మ రంధ్రం ద్వారా శరీరంలోకి ప్రసరింపజేసి నాడులను చైతన్యపరుస్తాయి. చిక్కుడు ఆకులతో రథాన్ని తయారు చేసి.. సూర్యుడికి ఎదురుగా ఉంచాలి. కొత్త బెల్లం, కొత్త బియ్యం, చెరకు, ఆవు పాలతో చేసిన పాయసాన్ని చిక్కుడు ఆకులపై వేసి సూర్యభగవానుడికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ ప్రసాదాన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. రథసప్తమి నాడు తలపై దీపం పెట్టి ఆ దీపాన్ని నది లేదా చెరువులో వదిలేస్తే మరుజన్మ ఉండదని చాలా మంది విశ్వాసం. రథసప్తమి నాడు సూర్యోదయం తర్వాత దానాలు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే సూర్యోపాసన చేయాలనుకునే వారు షష్టి నాడు ఒంటిపూట భోజనం చేయాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి