iDreamPost

హైదరాబాద్‌లో మందుబాబులకు షాక్.. ఇకపై అలాంటి వారికి నో లిక్కర్

హైదరాబాద్‌లో మందుబాబులకు షాక్.. ఇకపై అలాంటి వారికి నో లిక్కర్

గత కొన్నిరోజులుగా హైదరాబాద్‌లో అధిక సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసుకు బయట పడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఎక్సైజ్ అధికారులు అప్రమత్తమయ్యారు. వ్యాపిస్తున్న కరోనా కేసులకు అడ్డుకట్ట వేయాలని కొత్త నిబంధనలు తీసుకొచ్చారు.

ఇకపై మందుబాబులకు ఏమాత్రం జ్వరం ఉన్నా లిక్కర్ అమ్మకూడదని మద్యం విక్రయించే దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారు. మద్యం కొనడానికి వచ్చే మందు బాబులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన తర్వాతే విక్రయాలు జరపాలని ఆదేశించారు. ఒకవేళ కాస్త జ్వరంగా ఉన్నా విక్రయాలు జరపకూడదని ఎక్సైజ్ అధికారులు వైన్ షాప్ యజమానులకు ఆదేశాలు ఇవ్వడంతో శరీర ఉష్ణోగ్రత మాములుగా ఉన్నవారికి మాత్రమే లిక్కర్ అమ్మకాలు జరగనున్నాయి.

ఒకవేళ ఎవరికైనా అత్యధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు థర్మల్ స్క్రీనింగ్ లో బయట పడితే వారికి మద్యాన్ని విక్రయించరు. కాస్త జ్వరంగా ఉన్నవారికి హైదరాబాద్ లో మద్యం విక్రయించొద్దని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఎవరైనా మాస్క్ ధరించకుండా వస్తే వారికి మద్యం విక్రయించడం లేదన్న సంగతి తెలిసిందే. దాంతోపాటు వైన్ షాప్స్ దగ్గర భౌతిక దూరం పాటించేలా నిబంధనలు విధించిన సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి