iDreamPost

ఫైనల్​గా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

  • Author singhj Updated - 09:17 PM, Sat - 22 July 23
  • Author singhj Updated - 09:17 PM, Sat - 22 July 23
ఫైనల్​గా ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే..?

బాలీవుడ్​కు ఈ ఏడాది బాగానే కలిసొస్తోంది. గత కొన్నేళ్ల నుంచి ఉత్తరాదిన హిందీ చిత్రాల కంటే సౌత్ మూవీస్​దే హవా నడుస్తోంది. ‘బాహుబలి’ సిరీస్​ నుంచి మొదలుకొని ‘కేజీఎఫ్’ సిరీస్, ‘పుష్ప’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కాంతార’, ‘కార్తికేయ 2’ వరకు బాలీవుడ్​ బాక్సాఫీస్​ను పలు దక్షిణాది చిత్రాలు షేక్ చేశాయి. ఒకవైపు సౌత్ సినిమాలను బాగా ఆదరిస్తూ కోట్లాది రూపాయల కలెక్షన్లను కట్టబెడుతున్న నార్త్ ఆడియెన్స్.. మరోవైపు హిందీ ఫిల్మ్స్​ను మాత్రం రిజెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది కొంతవరకు మార్పు కనిపిస్తోంది. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రమంగా కోలుకుంటున్నట్లే కనిపిస్తోంది.

బాలీవుడ్​ బాద్​షా షారుక్ ఖాన్ నటించిన ‘పఠాన్’ మూవీ బ్లాక్ బస్టర్​గా నిలిచి హిందీ చిత్ర పరిశ్రమలో మళ్లీ జోష్ నింపింది. ఈ సినిమాతో ఏకంగా రూ.1,000 కోట్లకు పైగా కలెక్షన్లతో దుమ్మురేపాడు షారుక్. ‘పఠాన్​’తో పాటు మరికొన్ని హిందీ మూవీస్ ఈ సంవత్సరం మంచి హిట్స్​గా నిలిచాయి. అలాంటి వాటిలో ఒకటి ‘ది కేరళ స్టోరీ’. రిలీజ్​కు ముందే వివాదాలతో హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ లవ్ జిహాద్ నేపథ్యంలో వచ్చి కాంట్రవర్సీలతో పాటు కాసుల వర్షాన్ని కురిపించింది. కొన్ని రాష్ట్రాల్లో ఈ సినిమాను నిషేధించడం గమనార్హం.

‘ది కేరళ స్టోరీ’ థియేటర్లలోకి వచ్చి దాదాపుగా రెండు నెలలు కావొస్తోంది. కానీ ఇప్పటికీ ఈ మూవీ ఓటీటీలోకి రాలేదు. దీనికి ఓ బలమైన కారణం ఉందని నెటిజన్స్ అంటున్నారు. ‘ది కేరళ స్టోరీ’ శాటిలైట్, డిజిటల్ రైట్స్​ను విక్రయించడానికి మేకర్స్ భారీగా డిమాండ్ చేశారట. భారీ మొత్తం ఇస్తే అమ్ముతామని చెప్పడంతో ఓటీటీ సంస్థలు వెనకడుగు వేశాయట. అయితే మొత్తానికి ఓటీటీలోకి వచ్చేందుకు ‘ది కేరళ స్టోరీ’ రెడీ అవుతోందని టాక్. అదా శర్మ హీరోయిన్​గా నటించిన ఈ సినిమా హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్​ఫామ్ జీ5 దక్కించుకుందని సమాచారం. ఈ నెలాఖరు నుంచి ‘ది కేరళ స్టోరీ’ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అటు నిర్మాణ సంస్థ గానీ ఇటు ఓటీటీ ప్లాట్​ఫామ్స్​ గానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి