iDreamPost

30 ఏళ్ల తర్వాత HYDలో గ్రేట్ బాంబే సర్కస్.. అమెరికాలో రేంజ్ లో షోస్!

  • Published Feb 21, 2024 | 2:31 PMUpdated Feb 21, 2024 | 2:31 PM

సుమారు 30 ఏళ్ల తర్వాత అందరిని అలరించడానికి "ది గ్రేట్ బాంబే సర్కస్" హైదరాబాద్ కు వచ్చేసింది. ఈ సర్కస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సుమారు 30 ఏళ్ల తర్వాత అందరిని అలరించడానికి "ది గ్రేట్ బాంబే సర్కస్" హైదరాబాద్ కు వచ్చేసింది. ఈ సర్కస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Published Feb 21, 2024 | 2:31 PMUpdated Feb 21, 2024 | 2:31 PM
30 ఏళ్ల తర్వాత HYDలో గ్రేట్ బాంబే సర్కస్.. అమెరికాలో రేంజ్ లో షోస్!

ప్రస్తుతం అందరు ఎంటెర్టైనేమేంట్ అంటే సినిమాలు, మొబైల్ ఫోన్స్, అలా డిజిటల్ గానే ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే మాత్రం ఏడాదిలో ఎప్పుడో ఓసారి ఊరిలో ఏర్పాటు చేసే ఎక్సిబిషన్లు, జాతరలు, సర్కస్ లు. కానీ, ఇప్పుడున్న బిజీ బిజీ లైఫ్స్ లో .. డిజిటల్ యుగం నుంచి కాస్త బయటకు వచ్చి .. సరదాగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఈ సర్కస్ లు, ఎక్షిబిషన్ లే మంచి ఎంటెర్టైనెర్స్. వయస్సుతో సంబంధం లేకుండా ఇటువంటి వాటిపై దాదాపు అందరికి ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందులోను ఆసియాలోనే అతి పెద్ద షో అయినా బాంబే సర్కస్ ..చూడాలని ఎవరికీ మాత్రం అనిపించదు. అవును, ఇప్పుడు భాగ్యనగరంలో దాదాపు 30ఏళ్ల తర్వాత “గ్రేట్ బాంబే సర్కస్” ప్రత్యేక్షమయ్యింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ గ్రేట్ బాంబే సర్కస్ కు సుమారు 104 ఏళ్ళ చరిత్ర ఉంది. దాదాపు ఆసియా లోని అన్ని ప్రాంతాలలో ఎన్నో అద్భుతమైన షోస్ ను అందించింది ఈ సర్కస్. ప్రపంచ వ్యాప్తంగా ఈ సర్కస్ కు ఎంతో గొప్ప పేరు ఉంది. ఇప్పుడు ఈ సర్కస్ హైదరాబాద్ లోని.. కుత్బుల్లాపూర్ హెచ్‌ఎంటీ గ్రౌండ్స్‌లో ప్రదర్శన ఇస్తుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 1, సాయంత్రం 4, 7 గంటలకు ఈ షో ప్రదర్శనలు ఉంటున్నాయి. పైగా ఈ షో టికెట్ ధరలు కూడా అందరికి అందుబాటులోనే ఉన్నాయి. రూ. 100, 200, 300, 400 వరకు సర్కస్ టిక్కెట్ల ధరలు ఉన్నాయి. కాబట్టి వీకెండ్స్ లో ఫ్రెండ్స్ , ఫ్యామిలీ, పిల్లలతో బెస్ట్ టైం స్పెండ్ చేయాలంటే.. ‘గ్రేట్ బాంబే సర్కస్’ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అని చెప్పి తీరాలి.

కాగా, ఈ సర్కస్ లో.. అమెరికన్ ట్రాంపోలిన్, రష్యన్ రింగ్ డ్యాన్స్, ఇథియోపియన్ ఐకారియన్ యాక్ట్, 60 అడుగుల ఎగిరే ట్రాపెజ్ కళాకారుల స్కైవాక్, అరేబియన్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల విన్యాసాలను ప్రదర్శించే కళాకారులు .. అందరిని ఆశ్చర్యపరుస్తారు. అంతేకాకుండా .. పిల్లలకు ఇష్టమైన జోకర్స్ ఈ షోలో ప్రత్యేకంగా నిలుస్తారు. సుమారు 80 మందికి పైగా ఇతర దేశాల నుంచి వచ్చిన కళాకారులు .. ఈ షో ను ఎంతో ఆసక్తిగా తీసుకుని వెళ్లారు. వీటితో పాటు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచే మరెన్నో కార్యక్రమాలు .. గ్రేట్ బాంబే సర్కస్ లో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి కుటుంబం అంతా కలిసి హాయిగా ఎంజాయ్ చేయలంటే.. ఈ ప్లేస్ కు వెళ్లి తీరాల్సిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి