iDreamPost

తగ్గేదేలే రిపోర్ట్

తగ్గేదేలే రిపోర్ట్

కొన్నేళ్ల క్రితం దండుపాళ్యం అనే కన్నడ సినిమా సౌత్ లో పెద్ద సంచలనమే రేపింది. నిర్మానుషమైన ఇళ్లను ఎంచుకుని అందులో ఉన్న వాళ్ళను చంపి దొంగతనాలకు పాల్పడే ముఠా కథను తెరకెక్కించిన తీరు ప్రశంసలు, వసూళ్లను దక్కించుకుంది. దాని దర్శకుడు శ్రీనివాసరాజు మరో రెండు భాగాలు తీశారు కానీ అంత గొప్ప పేరేం రాలేదు. ఆయన ఇంకా ఆ హ్యాంగోవర్ లోనే ఉంటూ మరోసారి తగ్గేదేలే పేరుతో ఒక వయొలెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పోస్టర్లు ట్రైలర్ గట్రా మాస్ ని టార్గెట్ చేసేలా ఉండటంతో ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందేమోనని ఆశించిన వాళ్ళు లేకపోలేదు. పుష్ప డైలాగ్ ని టైటిల్ గా పెట్టుకున్న ఈ సినిమా ఎలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం.

Thaggedele | Telugu Movie News - Times of India

సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే ఈశ్వర్(నవీన్ చంద్ర)ఓసారి స్నేహితులతో ప్యారడైజ్ అనే ఆశ్రమానికి వెళ్లి అక్కడ లిజి(అనన్య రాజ్) తో ఏర్పడ్డ పరిచయం కాస్తా శారీరక సంబంధం దాకా వెళ్తుంది. కానీ దీన్ని జరిగింది మర్చిపొమ్మని లిజి అతన్ని అక్కడితో కట్ చేస్తుంది. తర్వాత ఈశ్వర్ కు మరదలు దేవి(దివ్య పిళ్ళై)తో పెళ్లవుతుంది. అంతా బాగుందనుకుంటున్న టైంలో వీళ్ళ జీవితంలోకి లిజి ప్రవేశిస్తుంది. అనూహ్యంగా ఆమె హత్యకు గురై ఈశ్వర్ లైఫ్ ని ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఈ మొత్తం కథకు దండుపాళ్యం గ్యాంగ్ కి ఉన్న కనెక్షన్ ఏంటి, వాళ్లేందుకు ఇందులో ప్రవేశించారు అనేది తెలుసుకోవాలంటే మిగిలిన స్టోరీ కోసం థియేటర్ కు వెళ్ళాలి.

Thaggedele Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes

సబ్జెక్టుకి టైటిల్ కి ఏ మాత్రం సంబంధం లేదు. కేవలం క్రేజ్ కోసం బన్నీ మాటను వాడుకున్నారు అంతే. ప్లాట్ లో ఎంతో కొంత విషయమున్నప్పటికీ అతి వయొలెన్స్ చూపడమే మాస్ ని ఆకట్టుకుందనే అంచనాతో శ్రీనివాసరాజు మరోసారి బి గ్రేడ్ అవుట్ ఫుట్ ఇచ్చారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా సీన్లు అతిని పరాకాష్టకు తీసుకెళ్లి ఇదేం టార్చర్ రా అనిపిస్తాయి. పాత్రల ప్రవర్తన అసహజంగా సాగడంతో ఆర్టిస్టులు మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చినా ఉపయోగపడలేదు. నవీన్ చంద్ర, రవిశంకర్ ల నటన మాత్రమే తగ్గేదేలేలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్. థ్రిల్ ని ఎక్స్ పెక్ట్ చేసి సినిమాకు వెళ్తే ఉన్న ఆసక్తిని కూడా కిల్ చేసేలా సాగింది తగ్గేదేలే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి