Uppula Naresh
Uppula Naresh
సోషల్ మీడియా పుణ్యమా అని పేదింట్లోని టాలెంట్ ఉన్న చాలా మంది ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. పల్లెటూరులోని టాలెంట్ ఉన్న ఎంతో మంది చిన్నారులు పేదికరికం అడ్డు కావడంతో వారి ప్రతిభ గ్రామం వరకు పరిమితమవుతోంది. అయితే ఈ క్రమంలోనే సోషల్ మీడియా అందుబాటులోకి రావడంతో వారి టాలెంట్ మెల్ల మెల్లగా అందరికీ తెలిసిపోతుంది. ఇదిలా ఉంటే.. మట్టిలో మాణిక్యం అన్నట్లుగా పేదింట్లో పుట్టిన ఓ బాలిక తన అద్భుతమైన డ్యాన్స్ తో ఇరగదీసి అందరి మన్ననలు పొందుతోంది. ఆ చిన్నారి చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. ఈ వీడియో దాదాపు 3 లక్షల మందికి పైగా వీక్షించారు. ఇంతకు ఈ అమ్మాయి ఎవరు, ఏంటనే పూర్తి వివరాలు మీ కోసం.
తెలంగాణలోని జనగామ జిల్లా పాలకూర్తి మండలం మల్లంపల్లి పరిధిలోని దాసుగూడెం తండాకు చెందిన కునుసోత్ అంజలి తల్లిదండ్రులతో పాటు నివాసం ఉంటుంది. అయితే అంజలి మల్లంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రస్తుతం 10వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాఠశాలలో ఉపాధ్యాయులు బాలసభ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి తన టాలెంట్ ఏంటో అందరికీ చూపించింది. కాలం నీతో నడవదు.. నిన్నడిగి ముందుకు సాగదు అనే పాటకు అద్భుతమైన పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె డ్యాన్స్ చేస్తుండగా తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు వీడియో తీసుకున్నారు.
ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారింది. ఈ వీడియోను దాదాపు 3 లక్షల మందికిపై వీక్షించారు. ఇదే కాకుండా 10 వేల లైక్స్ రావడం విశేషం. ఈ చిన్నారి డ్యాన్స్ చూసి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలాంటి ప్రతిభవంతులను ప్రోత్సహిస్తే భవిష్యత్ లో మంచి డ్యాన్సర్ గా ఎదిగే అవకాశం లేకపోలేదని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అద్బుతమైన పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసిన అంజలీ టాలెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.
ఇది కూడా చదవండి: పొలిటికల్ ఎంట్రీపై రాహుల్ సిప్లిగంజ్ క్లారిటీ! పోస్ట్ వైరల్..