Singer Chinmayi :నంద్యాల ఘటనపై సింగర్ చిన్మయి స్పందన.. మీలో దమ్ముందా అంటూ !

సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలపై.. స్పదింస్తునే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై స్పందించిన వీడియో.. నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలపై.. స్పదింస్తునే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలపై స్పందించిన వీడియో.. నెట్టింట్లో వైరల్ అవుతుంది.

ప్రతి రోజు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఎదో ఒక తప్పు జరుగుతూనే ఉంటుంది. ఉదయం లేచింది మొదలు పడుకునే వరకు అందరిని సోషల్ మీడియానే నడిపిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. కానీ అదే సోషల్ మీడియా వలన చాలా మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ప్రస్తుతం మీడియా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏదంటే.. అడల్ట్ మీమ్స్ , డార్క్ మీమ్స్ చేసిన ప్రణీత్ హనుమంతు.. అలాగే నంద్యాల జిల్లాలో మైనర్ బాలిక అత్యాచారం. ఈ రెండు విషయాలు ప్రస్తుతం అందరి హృదయాలను కదిలిస్తున్న సంఘటనలు. ఈ క్రమంలో ఈ విషయంపై చిన్మయి శ్రీపాద స్పందించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.

సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పటికప్పుడు మీడియా సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాలపై.. స్పదింస్తునే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా ఆమె.. డార్క్ కామెడీ , మీమ్స్ , ట్రోల్ల్స్ చేసే వారిపై విరుచుకుపడింది. ఈ విషయంపై స్పందిస్తూ.. ఇలా చెప్పుకొచ్చింది. “రే*ప్ లు చేసే వారిని చూసి అందరు మండిపడుతున్నారు. కానీ మన పక్కనే ఉంటూ అడల్ట్ జోక్స్ వేసే వారిని మాత్రం నిలదీయలేకపోతున్నాం. ఇలాంటి మీమ్స్ , ట్రోల్ల్స్ ఎందుకు వేస్తున్నారని అడిగే దమ్ము మనకు లేకపోయింది. ఒకవేళ ఇలాంటి వాటి మీద స్పందిస్తే.. యాంటీ నేషనల్ , ఫెమినిస్ట్ , అర్బన్ నక్సల్స్ అంటూ విమర్శిస్తారు.” అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నించింది.అలాగే మైనర్ బాలిక అత్యాచార ఘటనపై స్పందిస్తూ.. ” మూడో తరగతి చదువుతున్న చిన్నారి మీద మైనర్ బాలులు చేసిన అత్యాచార ఘటన మీద అందరూ రియాక్ట్ అవుతున్నారు.. అయ్యో సమాజం ఎటు పోతోంది.. ఏమైపోతోంది.. పిల్లలకు ఫోన్లు ఇవ్వొద్దు.. పిల్లలకు నెట్ కట్ చేయాలని అంటున్నారు.. అలాంటి వారే మళ్లీ సోషల్ మీడియాలో అడల్ట్ కామెడీ, మీమ్స్, ట్రోల్స్, డార్క్ కామెడీ అంటూ పిచ్చి పిచ్చిగా కామెంట్లు చేస్తున్నారు”. అంటూ మండిపడింది చిన్మయి.

ఈ క్రమంలో ఓ మీమ్ ను చూపిస్తూ.. దానికి నెటిజన్స్ పెట్టిన కామెంట్స్ ను కూడా చూపిస్తూ.. “ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్లు చేశారు. ఇలా కామెంట్లు చేసే వారు మన చుట్టూ ఉంటారు.. వారిని ప్రశ్నించే గట్స్, దమ్ము ఉందా? పైగా చదువుకున్న వారే ఇలాంటి కామెంట్లు పెడుతున్నారు.. ఇదంతా ఏంటి? అని అడిగితే.. మళ్లీ ఫెమినిస్టులు, అర్బన్ నక్సల్స్, యాంటీ నేషనల్స్ అంటూ కొంత మంది కేసులు పెట్టేందుకు రెడీ అవుతారు.”అంటూ ప్రశ్నించింది చిన్మయి. ఏదేమైనా చిన్మయి చెప్పిన విషయం నూటికి నూరు శాతం కరెక్ట్ అని చెప్పి తీరాలి. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments