హైదరాబాద్‌లో క్షణాల్లో నేలమట్టమైన రెండు భారీ భవనాలు!.. ఆ కారణంతోనే?

హైదరాబాద్ మహానగరంలో ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలకు కొదవ లేదు. ఐటీ కారిడార్ లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది. అయితే ఉన్నట్టుండి హైటెక్ సిటీ ప్రాంతంలో రెండు భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలోనే రెండు భవనాలను కూల్చివేశారు అధికారులు. దీంతో ఆ ప్రాంతమంతా దట్టమైన దుమ్ము అలుముకుంది. అయితే భవనాల కూల్చివేత సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ఏ విధమైన ప్రమాదం చోటుచేసుకోలేదు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ఐటీ ఉద్యోగులతో ఎప్పుడూ రద్దీగా ఉండే మాధాపూర్ లోని మైండ్ స్పేస్ లో రెండు భారీ భవనాలు కూల్చివేశారు అధికారులు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా భారీ భవనాలను కూల్చినట్లు వెల్లడించారు. కాగా బిల్డింగులను కూల్చివేసిన చోటులోనే మరో కొత్త భవనాలను నిర్మించనున్నట్లు అధికారులు చెప్పారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి, భారీ పేలుడు పదార్థాలతో రెండు భవనాలను కూల్చివేశారు. క్షణాల వ్యవధిలోనే భవనాలు నెలమట్టమయ్యాయి. కాగా బిల్డింగ్ ల కూల్చివేత సమయంలో పక్కనున్న భవనాలకు ముప్పువాటిల్లకుండా తగిన చర్యలు తీసుకున్నారు అధికారులు.

Show comments