కొత్త తరహా సైబర్ మోసం.. స్కూల్,కాలేజీ అమ్మాయిలే వాళ్ల టార్గెట్- సజ్జనార్

నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మరీ, ఆ వివరాలేంటో చూద్దాం.

నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మరీ, ఆ వివరాలేంటో చూద్దాం.

నగరంలో రోజు రోజుకి పరిస్థితి చాలా దారుణంగా మారిపోతుంది. ఎటువైపు నుంచి ఎలా ఈజీగా డబ్బులు సంపాదించాలోనని చాలామంది కేటగాళ్లు మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు.ఇక వీరి అత్యాశకు అమాయకపు ప్రజలు నిలువున మోసపోతున్నారు. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ల లిస్ట్ లో సామన్యులు, సెలబ్రిటీస్, ప్రభుత్వ అధికారులు అనే తేడా లేకుండా అందర్నీ టార్గెట్ చేస్తూ లక్షల రూపాయాలు కొల్లగొడుతున్నారు. ఇక వీరి మోసాలు మూవీ సీజన్స్ లా కొత్త కొత్తగా పెరిగిపోతున్నాయి. తాజాగా నగరంలో మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అయితే ఈసారి సైబర్ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే అంటూ టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. మరీ, ఆ వివరాలేంటో చూద్దాం.

నగరంలో సైబర్ నేరగాళ్లు కొత్తగా.. స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. ముఖ్యంగా వారిని కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారు. ఒకవేళ తాము అడిగినంత డబ్బు ఇవ్వకుంటే వారిని కిడ్నాపర్లు చంపేస్తారంటూ భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ రాయ‌దుర్గంలో ఓ విద్యార్థిని తల్లిదండ్రులకు విదేశీ ఫోన్ నంబ‌ర్‌తో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్ చేశారు. అనంతరం ‘నేను పోలీస్ ఆఫీస‌ర్‌ను మాట్లాడుతున్నాను, కాలేజీకి వెళ్లిన మీ అమ్మాయి కిడ్నాప్‌న‌కు గురైంది. ప్రస్తుతం ఆమె మా ద‌గ్గరే ఉంది. వెంట‌నే మేం అడిగినంత డ‌బ్బును ఆన్‌లైన్ ద్వారా పంపించకపోతే కిడ్నాపర్లు  మీ అమ్మాయిని చంపేస్తారు అని బెదిరించారు. అంతేకాకుండా.. మీ అమ్మాయి ఏడుస్తుందంటూ’ ఒక వాయిస్ కూడా వినిపించారు.

అయితే ఏడుస్తున్న గొంతు వినిపించడంతో.. కాలేజీకి వెళ్లిన త‌మ‌ కూతురు కిడ్నాప్‌న‌కు గురైంద‌ని త‌ల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. ఏకంగా పోలీసులే కాల్ చేయటంతో డ‌బ్బులు పంపించేందుకు సిద్ధమయ్యారు. అంతేకాకుండా.. మోసగాళ్లతో ఫోన్‌లో మాట్లాడుతూనే త‌మ బంధువుల‌కు ఈ విష‌యాన్ని చెరవేసి, తమ కూతురు కాలేజీలో ఉందో లేదో తెలుసుకోమని పంపించారు. ఇక కాలేజీకి వెళ్లిన బంధువులు అమ్మాయి క్షేమంగా ఉందని చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇప్పటి వరకు తమకు ఫోన్ చేసి బెదిరించింది మోసగాళ్లని పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పై స్పందించిన టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్  తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా బెదిరింపులు చాలానే వస్తున్నాయని  ట్వీట్ చేశారు.

ఇక ఆ ట్వీట్ లో.. ‘ఆడ పిల్లలను కిడ్నాప్ చేశార‌ని చెప్పగానే న‌మ్మి తల్లిదండ్రులు సైబర్ కేటుగాళ్లకు డ‌బ్బులు పంపిస్తున్నారు. కానీ, ఇలా అజ్ఞాత వ్యక్తుల నుంచి విదేశీ ఫోన్ నెంబర్లతో వ‌చ్చే వాట్సాప్ కాల్స్‌కు ఎవరూ స్పందించవద్దని పేర్కొన్నారు. అలాగే వారి బెదిరింపులకు ఏ మాత్రం భయపడకుండా.. వెంటనే స్థానిక పోలీస్ స్టేష‌న్లలో ఫిర్యాదు చేయాలని, ప్రతిఒక్కరూ సైబర్ నేరాల పట్ల  అప్రమత్తంగా ఉండాలని’ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం సజ్జానర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. మరీ, నగరంలో సైబర్ కేటుగాళ్లు ఈ తరహా కొత్త మోసలకు పాల్పడుతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments