RTC సిబ్బందికి సజ్జనార్ బొనాంజా.. భారీగా నగదు పురస్కారం

ఇటీవలే మేడారం సమ్మక్క సారలమమ్మ మహాజాతరలో ఆర్టీసీ తన వంతు చేసిన సేవలకుగాను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ శుభవార్తను తెలిపారు.

ఇటీవలే మేడారం సమ్మక్క సారలమమ్మ మహాజాతరలో ఆర్టీసీ తన వంతు చేసిన సేవలకుగాను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ శుభవార్తను తెలిపారు.

ఇటీవలే మేడారం సమ్మక్క సారలమమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. ఎంతో అంగరంగ వైభవంగా సాగిన ఈ జాతరలో..గద్దెలపై కొలువుదీరిన ఆ తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. అయితే ఈ జాతరకు ఎన్నడూ లేనంతగా భక్తులు పోటెత్తారని సమాచారం. కాగా, ఈ వన దేవతల జాతరకు కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కోటి 65 లక్షల మంది దర్శించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చిన భక్తులకు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అనేక సహాక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ఈ జాతరకు తరలి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా.. సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ తన వంతు కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే ఇలా ఎంతోమంది భక్తులను సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించే సేవలకుగాను రోడ్డు రవాణా సంస్థ గురువారం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

మేడారం మహా జాతర సందర్భంగా రాష్ట్రంలోని.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల కోసం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దాదాపు నాలుగు వేల ప్రత్యేక బస్సుల్ని నడిపించింది. ఈ బస్సుల్లో సుమారు 20 లక్షల మంది భక్తులు ప్రయాణించారు. దాదాపు ఎనిమిది రోజుల పాటు అనగా.. ఫిబ్రవరి 18 నుంచి 25 వరకు ఆర్టీసీ మేడారానికి ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించాయి. అయితే ఒకవైపు భారీగా వచ్చిన భక్తులకు..రహదారులపై ట్రాఫిక్‌ జామ్‌ వంటి సవాళ్ల ఎదుర్కొని మేడారం జాతరకి తీసుకెళ్లి, మళ్లీ సురక్షితంగా వారి గమ్యస్థానాలకు ఆర్టీసీ చేర్చింది. అలా ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకెళ్లడంలో సిబ్బంది అందించిన సేవలకుగాను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ నగదు  పురస్కారాలు అందజేయనున్నట్లు తెలిపారు.

ఈ క్రమంలోనే.. ఒక్కో డ్రైవర్‌, ఎస్‌డీఐకి రూ.1,000, కండక్టర్లు, మెకానిక్‌లు, శ్రామికులు, ఆర్జిజన్లు, క్లర్కులకు రూ.500 చొప్పున నగదు పురస్కారాలు అందజేయనునున్నారు. ఇక, జాతరతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. అటు, ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో.. మహిళలే కాక వారి కుటుంబమంతా ఆర్టీసీ బస్సులనే ఎంచుకున్నారు. దీంతో జాతర సర్వీసుల్లో సగటున 98శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. ప్రత్యేక బస్సులను ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా నడిపారు.మరి, మేడారం జాతర సమయంలో ఆర్టిసీ సిబ్బంది అందించిన సేవలకుగాను  టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్  తీసుకున్న నిర్ణయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments