మహిళలకు అలర్ట్‌.. ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్‌

TSRTC Free Bus Journey: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్రీ బస్‌ జర్నీకి సంబంధించి కీలక అప్డేట్‌ మీ కోసం

TSRTC Free Bus Journey: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్రీ బస్‌ జర్నీకి సంబంధించి కీలక అప్డేట్‌ మీ కోసం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తోన్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని అమలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ స్కీమ్‌ అమలు చేసిన నాటి నుంచి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి.. మగవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఆర్టీసీ మరిన్ని కొత్త బస్సులు కొనగోలు చేసేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి కొత్త రూల్స్‌ అమల్లోకి రాబోతున్నాయట. ఆ వివరాలు..

సాధారణంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే.. తెలంగాణవాసులమని తెలిపే గుర్తింపు కార్డు చూపించాలి. అంటే ఆధార్‌, ఓటర్‌ ఐడీ కార్డు చూపించాలి. అది కూడా ఒరిజనల్‌ మాత్రమే అయి ఉండాలి. లేదంటే టికెట్‌ తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు చూపించినా సరే.. ఈ మధ్య కాలంలో కొందరు కండక్టర్లు.. టికెట్‌కు డబ్బులు తీసుకుంటున్నారు. ఎందుకు.. ఆధార్‌ కార్డ్‌ ఉన్నా సరే.. టికెట్‌ ఎందుకు తీసుకోవాలి అంటే.. ఆధార్‌ కార్డులోని మీ ఫొటో పాతది ఉంటే.. ఇలాంటి సమస్య తలెత్తుతుంది. ఆధార్ కార్డులో ఫోటో అప్‌డేట్‌గా ఉండేలా చూసుకోండి. లేదంటే మాత్రం ఇబ్బంది పడాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇటీవలనే హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ ప్రయాణంలో ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది

ఆధార్ కార్డులో ఫొటో పాతది ఉంటే.. ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం చేయడానికి ఇబ్బందులు తలెత్తొచ్చు. అంటే కొంత మంది ఆధార్ కార్డులో ఫొటో ఎప్పటిదో ఉంటోంది. ప్రస్తుతం వారి రూపుకు.. ఆధార్‌లో ఫొటోకు పోలిక ఉండటం లేదు. ఇక హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూల్ వెళ్లే బస్ ఎక్కిన మహిళకు కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. బస్ ఎక్కిన సదురు మహిళ విషయానికి వస్తే.. పెళ్లి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆధార్ కార్డులో చిన్నపటి ఫొటోనే ఉంది. అప్‌డేట్ చేసుకోలేదు. దీని వల్ల ఆధార్ ఫొటోలోని ఫేస్‌కు, ప్రస్తుతం ఆమె రూపుకు పోలిక లేదు. దాంతో కండక్టర్‌ ఆమెను టికెట్‌ తీసుకోవాలని సూచించాడు. దాంతో ఆధార్‌ కార్డు ఉన్నా సరే ఆ మహిళ టికెట్‌ తీసుకోవాల్సి వచ్చింది.

అందువల్ల మీరు కూడా ఆధార్ కార్డులో ఫొటోను చాలా ఏళ్లుగా అప్‌డేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం వెంటనే అప్‌డేట్ చేసుకోండి. లేదంటే మీకు కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. పాత ఆధార్ కార్డులో అడ్రస్‌ దగ్గర ఆంధ్రప్రదేశ్ అని ఉండొచ్చు. అందువల్ల దీని కూడా తెలంగాణగా మార్చుకుంటే మంచిది.. లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది తలెత్తవచ్చు. అందువల్ల ఉచిత ప్రయాణం చేసే మహిళలు.. ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకుంటే మంచిది అంటున్నారు.

Show comments