ఇంటర్ ఫలితాలు.. మరో విద్యార్థిని దారుణ నిర్ణయం

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. పాసైన విద్యార్థులు ఆనందంలో మునిగి తేలుతుంటే.. ఫెయిలైన విద్యార్థులు మానసికంగా వేదన చెందుతూ దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 10 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. పాసైన విద్యార్థులు ఆనందంలో మునిగి తేలుతుంటే.. ఫెయిలైన విద్యార్థులు మానసికంగా వేదన చెందుతూ దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 10 మందికి పైగా విద్యార్థులు మృత్యువాత పడ్డారు.

పరీక్షలు, మార్కులు అనేవి కేవలం ఉన్నత తరగతులకు వెళ్లేందుకు మార్గం మాత్రమే. పరీక్షల్లో ఫెయిల్ అయితే.. జీవితంలో వైఫల్యం చెందినట్లు కాదు. ఇది ఆలోచించలేని ఎంతో మంది ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆత్మనూన్యత భావనతో ఉంటున్నారు. ప్రతిభకు మార్కులు కొలమానం కాదు అనే విషయాన్ని మరిచిపోతున్నారు. అలాగే ఇరుగు పొరుగు పిల్లలతో మన పిల్లల్ని కంపేర్ చేసి చూడటం, బంధువులు, చుట్టాలు పాసయ్యవా అనే ప్రశ్నలకు ఎక్కడ తలొంచుకోవాల్సి వస్తుందోనన్న భయంతో కూడా పిల్లలు మానసికంగా కుంగిపోతున్నారు. వెరసి ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.

తాజాగా తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కొంత మంది చిన్నారులు ఫెయిల్ కావడంతో తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటికే 10 మందికి పైగా ఇంటర్ విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఫలితాలు విడుదలయ్యి ఐదు రోజులు గడుస్తున్నా ఇంకా ఇంటర్ విద్యార్థులు మరణాలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ నెల 24న ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది బోర్డు. ఈ ఫలితాల్లో మహాబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాల విద్యార్ధిని స్వాతి ఫెయిల్ అయ్యింది. బాగా చదివాను.. పాస్ అవుతాను అనుకుంది. కానీ ఫెయిల్ కావడంతో రెండు రోజుల పాటు బాధపడ్డ ఆమె.. ఆ ఆవేదనలోనే ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..నర్సింహుల పేట మండలం రూప్లతండ జీపీ పరిధిలోని ఎర్రచెక్రు తండాకు చెందిన గుగులోతు బీమాకు ఇద్దరు కుమార్తెలు.. చిన్న కుమార్తె స్వాతి తొర్రూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది.

ఇటీవల విడులైన ఇంటర్ ఫలితాల్లో ఆమె రెండు సబ్జెక్టుల్లో తప్పింది. ఇంటర్ ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్థాపానికి లోనైంది స్వాతి. రెండు రోజుల పాటు తీవ్ర ఆవేదన చెందింది. ఈ బాధలో పురుగుల మందు తాగింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు ఆమెను మహాబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ స్వాతి మరణించింది. కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఎంతో మంది విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం కలవరపాటుకు గురి చేస్తుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు  ఫెయిల్ అయిన తమ విద్యార్థులకు అండగా నిలవాలని  సూచిస్తున్నారు వైద్యులు.

Show comments