Ration Card Beneficiaries Good News: రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు! త్వరలో..

రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు! త్వరలో..

Ration Card Beneficiaries Good News: దేశంలో నిరుపేల కోసం ఏర్పాటు చేసింది రేషన్ కార్డు. రేషన్ కార్డు కలిగిన వారు ప్రభుత్వం పథకాల ప్రయోజనాలు నేరుగా పొందుతారు.బియ్యం, నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయి.

Ration Card Beneficiaries Good News: దేశంలో నిరుపేల కోసం ఏర్పాటు చేసింది రేషన్ కార్డు. రేషన్ కార్డు కలిగిన వారు ప్రభుత్వం పథకాల ప్రయోజనాలు నేరుగా పొందుతారు.బియ్యం, నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయి.

దేశంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు ప్రభుత్వం రేషన్ కార్డులను పంపిణీ చేస్తుంది. ఈ కార్డు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. రేషన్ కార్డు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి.. లబ్దిదారులకు ఆహార ధాన్యాలు, బియ్యం, గోదుమలు, నిత్యావసర సరుకులు తక్కువ ధరలకు లభిస్తాయి. అంతేకాదు రేషన్ కార్డు చాలా ముఖ్యమైన ప్రభుత్వ గుర్తింపుగా పరిగణిస్తారు. ఆధార్, బ్యాంక్ లావేవీలు, ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు అవసరం ఉంటుంది. ఇటీవల తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కొరకు పౌర సరఫరాల శాఖ కసరత్తు మొదలు పెట్టింది. ఈ ప్రక్రియ పూర్తికాగానే కార్డుల జారీ వేగవంతం చేయాలనే ఆలోచనలో ఉంది తెలంగాణ సర్కార్. తాజాగా రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్ న్యూస్ చేపింది రేవంత్ సర్కార్. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వచ్చే సంవత్సరం నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డు జారీ, విధివిధానల ఖారారు అంశాలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ మేరకు కీలక ప్రకటన చేసింది. రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ప్రతి సంవత్సరం 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ అవుతున్నట్లు కమిటీ గుర్తించింది. దీనిలో సగానికి పైగా పక్కదారి మళ్లుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం అంగన్ వాడీ, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతుందని.. వచ్చే సంవత్సరం నుంచి రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయించుకుంది.

ఇదిలా ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీ పథకాల్లో భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల ప్రజా పాలన కార్యక్రమంలో లక్షల సంఖ్యల్లో కేవలం రేషన్ కార్డుల దరఖాస్తులే వచ్చాయి. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలు అయినట్లు వార్తలు వస్తున్నాయి.పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ముద్రించి ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు ఏటీఎం తరహాలో స్వైపింగ్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

 

Show comments