Telangana: రూ.500 సబ్సిడీ అకౌంట్ లో పడటం లేదా?అయితే ఇలా చేయండి..!

Mahalakshmi Scheme: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లో భాగంగా మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభంచిన సంగతి తెలిసింది. ఈ స్కీమ్ కింద. రూ.500లకే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకంకు సంబంధించి ఓ కీలక సమాచారం వచ్చింది.

Mahalakshmi Scheme: తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లో భాగంగా మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభంచిన సంగతి తెలిసింది. ఈ స్కీమ్ కింద. రూ.500లకే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకంకు సంబంధించి ఓ కీలక సమాచారం వచ్చింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను ప్రజలకు అందిస్తుంటాయి. కొన్ని సంక్షేమ పథకాలు ఉంటే, మరికొన్ని ఆర్థిక  భరోసా కోసం ఉంటాయి.  ఇది ఇలా ఉంటే..ప్రభుత్వాలు ప్రజలకు వివిధ  స్కీమ్ ల కింద సబ్సిడీ,  ఇతర డబ్బులును జమ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పలువురు ఈ డబ్బులు జమ కావు. ఈ క్రమంలో అలాంటి ఫిర్యాదులు అందితే ప్రభుత్వలు పరిష్కార చర్యలు తీసుకుంటాయి. అలానే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి కూడా కీలక సమాచారం మీకోసం అందిస్తున్నాము. మరి..ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీ స్కీమ్ లో భాగంగా మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభంచిన సంగతి తెలిసింది. ఈ స్కీమ్ కింద. రూ.500లకే గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు. మహిళా సాధికారతలో భాగంగా వారి కోసం రూ.500లకే గ్యాస్ సిలిండర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గతంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. అలా అప్లయ్ చేసుకున్న వారిలో అర్హులకు ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ కింద రూ. 500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు.

అయితే మహాలక్ష్మీ పథకం లబ్ధిదారులైనా కొందరి బ్యాంకు ఖాతాల్లో వెంటనే సబ్సిడీ డబ్బులు జమ కావటం లేదు. దీంతో పలువురు అర్హులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎవరికైతే సబ్సిడీ డబ్బులు ఖాతాల్లో జమ కావడం లేదో వారు ఆందోలన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అంతేకాక వారి సమస్య పరిష్కారం కోసం కీలక ప్రకటన చేశారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు నాలుగు రోజుల్లో జమ కానట్లయితే 1967 లేదా 180042500333 నంబర్‌కు కాల్ చేసి పరిష్కరించుకోవచ్చునని అధికారులు వెల్లడించారు. అలా ఫోన్ చేస్తే.. డబ్బులు ఆగిపోవటానికి గల కారణాలు ఆ పాటు ఎప్పుడు పరిష్కారం అవుతాయో స్పష్టంగా చెబుతారని అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ మహాలక్ష్మి పథకానికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు.

తొలిదశలో దాదాపుగా 40 లక్షల మందిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆయా అర్హుల ఎంపికకు సంబంధించిన పత్రాలను స్థానిక రేషన్ డీలర్ల వద్ద ప్రభుత్వం అందుబాటులో ఉంచుతోంది. వారి వద్దకు వెళ్లి అర్హులైన వారు వారి పత్రాలను తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని వారు చెబుతున్నారు. ఇంకా ఎవరికైనా మహాలక్ష్మి పథకం వర్తించకపోతే మండల కార్యాలయాల్లో దరఖాస్తు పెట్టుకోవచ్చునని అంటున్నారు. మొత్తంగా సబ్సిడ్ డబ్బులు పడని వారు అధికారులు చెప్పిన విధంగా చేసి..సమస్యను పరిష్కరించుకోవచ్చు.

Show comments