P Venkatesh
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేయనుంది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? మార్గదర్శకాలు ఏంటీ అనే వివరాలు మీకోసం..
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రకటన చేయనుంది. మరి ఈ పథకానికి అర్హులు ఎవరు? మార్గదర్శకాలు ఏంటీ అనే వివరాలు మీకోసం..
P Venkatesh
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు సిద్ధమవుతోంది. ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతం అని చెప్తున్న రేవంత్ సర్కార్ ఆదిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేసి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఆరోగ్య శ్రీ పథక పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. ఇప్పుడు మరో రెండు హామీలను అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వాటిల్లో ఒకటి గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించడం, రెండోది రూ. 500కే గ్యాస్ సిలిండర్. కాగా ఉచిత కరెంటు విషయమై తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో జరుగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అధికారికంగా ప్రకటించనున్నది.
ఈ నేపథ్యంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి లబ్థిదారుల ఎంపిక నేటి నుంచే జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అర్హుల వివరాల సేకరణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ సిబ్బంది విద్యుత్ వినియోగదారుల ఇంటింటికీ తిరిగి కరెంటు మీటర్ రీడింగ్ తీసి యజమానుల నుంచి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నంబర్‌లను తీసుకోనున్నారు. అయితే ఈ ఉచిత విద్యుత్ పథకానికి మార్గదర్శకాలు ఇవే అంటూ జోరుగా చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందించాలని భావిస్తుందట ప్రభుత్వం.
రేషన్ కార్డుతో పాటు ఒక ఇంటికి ఒక విద్యుత్ మీటర్ కే ఈ పథకం వర్తిస్తుందట. రేషన్ కార్డు లేని వారి నుంచి వివరాలను సేకరించరు. అంతేకాకుండా అద్దెకు ఉండే వారికి ఈ పథకం వర్తించదని వార్తలు వచ్చాయి.. తాజాగా దీనిపై విద్యుత్ పంపిణీ సంస్థ TSSPDCL స్పందించింది.. ఇలాంటి వార్తలు నమ్మవొద్దని.. ‘గృహజ్యోతి’ పథకానికి అద్దె ఇళ్లలో ఉండేవారు కూడా అర్హులే అని స్పష్టం చేశారు. ఎవరూ అపోహలకు లోను కావొద్దని, నిజమైన అర్హులు కిరాయి ఇళ్లల్లో ఉన్నా వారికి ఈ పథకం వర్తిస్తుందని అధికారులు ట్వీట్టర్ వేధికగా వెల్లడించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడుకునే గృహ వినియోగదారులకు మాత్రమే ఈ పథకం వర్తించనున్నట్లు స్పష్టమవుతోంది. 2022-23 ఆర్ధిక సంవత్సరంలో 2181 యూనిట్ల లోపు వాడకం ఉండాలి. గత సంవత్సరం మొత్తం ఓ వినియోగదారుడు 1500 యూనిట్లు వాడితే దానికి 10 శాతం కలిపి 1650 యూనిట్లను 12 నెలలకు విభజించి నెలకు 137 యూనిట్లు ఉచితంగా ఇస్తారు. ఆ పైన వాడితే బిల్లు లెక్క లెక్కించనున్నారు.
Tenants are also eligible under proposed Gruha Jyothi Scheme
Below post by @TeluguScribe is FAKE https://t.co/Ive0FG09dG
— TSSPDCL (@TsspdclCorporat) February 6, 2024