Free Current: తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఉచిత విద్యుత్తుపై మరో బంపరాఫర్‌

TG Govt-Gruha Jyothi, Free Current: తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌కు సంబంధించి మరో బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

TG Govt-Gruha Jyothi, Free Current: తెలంగాణ ప్రభుత్వం ఉచిత కరెంట్‌కు సంబంధించి మరో బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ సర్కార్‌.. ఆరు గ్యారెంటీల అమలుకు అధిక ప్రాధాన్యత ఇస్తూ.. అన్ని హామీలను అమలు చేసింది. అన్నింటి కన్నా ముఖ్యమైన రైతు రుణమాఫీ హామీని నిన్నటితోటే అనగా ఆగస్టు 15న పూర్తి చేసింది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లే.. 2 లక్షల వరకు రుణమాఫీ చేశారు. ఇక అధికారంలోకి రాగానే వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ వంటి హామీలను అమలు చేస్తోంది. అలానే ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయల వరకు పెంచింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలోనే వీటిని అమలు చేస్తామని తెలిపింది. ఈ క్రమంలో తాజాగా రేవంత్‌ సర్కార్‌ ఫ్రీ కరెంట్‌ మీద మరో బంపరాఫర్‌ ప్రకటించింది. ఆ వివరాలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 27న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్‌తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకాలకు అర్హులను సెలక్ట్‌ చేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఆ తర్వాత అర్హులైన వారికి జీరో బిల్స్‌ను జారీ చేస్తున్నారు. ఇందుకు గాను బిల్లింగ్ మిషన్స్‌లో ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ ఇన్స్టాల్ చేసి.. అర్హులైన వారికి ఆటోమెటిక్‌గా జీరో బిల్లు వచ్చేలా ప్లాన్ చేశారు. ప్రస్తుతం తెల్ల రేషన్ కార్డు ఉన్న చాలా కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతోంది.

అయితే కొందరికి అర్హత ఉన్నా సరే.. ఈ పథకానికి అప్లై చేసుకోలేదు. అలాంటివారికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు. గృహజ్యోతి పథకానికి అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారికి మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు భట్టి. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక విషయాలు ప్రస్తావించారు. విద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే అలసత్వం వద్దని, వెంటనే తన దృష్టికి తేవాలని బట్టి విక్రమార్క చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కరెంట్ కోతలు ఉండొద్దని, 24 గంటల పాటు కరెంటు ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగానే.. ఉచిత కరెంటు పథకానికి అర్హులై.. అప్లై చేసుకోని వారికి మరో అవకాశం ఇవ్వాలని సూచించారు.

Show comments