P Krishna
Telangana RTC Offers: హైదారాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ఉన్న ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
Telangana RTC Offers: హైదారాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ఉన్న ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది.
P Krishna
తెలంగాణ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సజ్జనార్ ప్రయాణికులకు పలు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఆర్టీసీ ప్రయాణికులు మెరుగైన వసతుల ఏర్పాటుతో పాటు పలు రాయితీలు కల్పిస్తున్నారు. తాజాగా తెలంగాణ బస్సు ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో పది శాతం రాయితీ కల్పిస్తుంది. దానికి మెట్రో బస్ పాస్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సుల్లోనూ ఈ రాయితీ అందుబాటులో ఉంటుందని తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
హైదారాబాద్ మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ ఉన్న ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గొప్ప శుభవార్త చెప్పింది. బస్ పాస్ ఉన్నవారు లహరి,రాజధాని, గరుడ ప్లస్, ఈ – గరుడ వంటి ఏసీ సర్విసుల్లో ప్రయాణిస్తే టికెట్ పై 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మెట్రో ఎక్స్‌ప్రెస్ పాస్ తో పాటు మెట్రో డీలక్స్, గ్రీన్ మెట్రో, ఎయిర్ పోర్ట్ పుష్పక్ బస్ పాస్ ఉన్న వారికి సైతం ఈ రాయితీ కల్పింబడుతంది. వచ్చే ఏడాది జనవరి 31 వరకు ఈ 10 శాతం రాయితీ అమల్లో ఉంటుందని ఆర్టీసీ తెలిపింది. ఈ గొప్ప అవకాశం ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ లు ఉన్నాయి. ఈ బస్ పాసులు కలిగి ఉన్న వారు శని, ఆదివారాల్లో తమ సొంతూళ్ళకు వెళ్తుంటారు. ఈ క్రమంలోనే ఆ బస్ పాస్ లు కలిగి ఉన్న ప్రయాణికులకు ఏసీ సర్వీసుల్లో 10 శాతం ఆఫర్ ప్రకటించింది ఆర్టీసీ. ‘హైదరాబాద్ లో దాదాపు 70 వేల వరకు మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాసులున్నాయి. వారిలో ఎక్కువగా వీకెండ్ లో సొంతూళ్లకు వెళ్తున్నారు.ఈ నేపథ్యంలోనే బస్ పాసుదారుల సౌకర్యార్థం ఏసీ సర్వీసుల్లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సంస్థ అధికారిక వెబ్ సైట్ http://tgsrtcbus.in లో ముందస్తు రిజర్వేషన్ చేసుకుని రాయితీని పొందవచ్చు.
జనరల్ బస్ పాస్ దారులు 10 శాతం డిస్కౌంట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాం.’ అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో శైవ క్షేత్రాలకు భక్తులు వెళ్తుంటారు. దీంతో భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ప్రత్యేక బస్సులను ప్రారంభిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట వంటి ప్రముఖ ఆలయాలకు ప్రత్యేక బస్సులు నడిపే ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ సంస్కరణలు, పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. కొత్త కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులతో మమేకమవుతూ.. వారి ఇబ్బందులను పరిష్కరిస్తున్నారు. అంతేకాదు ఆర్టీసీ సిబ్బందిని ప్రోత్సహిస్తూ వారికి బహుమతులతు ప్రకటిస్తున్నారు. ప్రజలు తమ వాహనాలను పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలని, ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సౌకర్య వంతంగా ఉంటుందని సజ్జనార్ ప్రజలకు సూచించారు. మరి ఈ బంపర్ ఆఫర్ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
హైదరాబాద్ లోని మెట్రో ఎక్స్ ప్రెస్ బస్ పాస్ దారులకు శుభవార్త!! తమ దగ్గర ఉన్న బస్ పాస్ తో లహరి, రాజధాని, గరుడ ప్లస్, ఈ-గరుడ, తదితర ఏసీ సర్వీసుల్లో ప్రయాణిస్తే టికెట్ లో 10 శాతం రాయితీని టీజీఎస్ఆర్టీసీ ప్రకటించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే అన్ని టీజీఎస్ఆర్టీసీ ఏసీ… pic.twitter.com/QINAoc8HlA
— VC Sajjanar – MD TGSRTC (@tgsrtcmdoffice) November 11, 2024