హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు బిగ్ షాక్.. హైకోర్టు నోటీసులు

HYDRAA Commissioner AV Ranganath: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్ పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అంతేకాకుండా.. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. 

HYDRAA Commissioner AV Ranganath: గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్ పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అంతేకాకుండా.. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. 

హైడ్రా.. గత కొన్ని రోజులుగా నగరంలో అక్రమదారులకు హడలెత్తిస్తూ, సామాన్యులకు వణుకు పుట్టిస్తూ, ఎన్నో ఇళ్లలను నిర్ధక్ష్యంగా కూల్చేస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా హైడ్రా కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన ఏవీ రంగనాథ్ ను ఆధ్వర్యంలో.. హైడ్రా అధికారులు . అత్యాధునిక టెక్నాలజీ, మెషీన్లతో భారీ భవనాలను గంటల వ్యవధిలోనే నేలమట్టం చేస్తున్నారు. ఇప్పటికే అక్రమ నిర్మాణాల కూల్చివేతలో దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ తరచు వార్తల్లో హెడ్ లైన్స్ లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా కమిషనర్ రంగనాథ్ పై హైకోర్టు సీరియస్ అవుతూ నోటిసులను జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో హైడ్రాతో పాటు కమిషనర్ రంగనాథ్ పై కూడా తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా  అధికారులు అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ముఖ్యంగా ప్రభుత్వం ఇచ్చిన ఫుల్ పవర్, ఫ్రీడమ్ మేరకు కమిషనర్ రంగనాథ్ రోజుకొక ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై దూసుకుపోతూ తనదైన మార్కును వేసుకున్నారు. అయితే ఇలాంటి సమయంలో కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది. అంతేకాకుండా.. వచ్చే సోమవారం తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది.

అంతేకాకుండా.. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని ప్రశ్నించింది. వచ్చే సోమవారం 10.30 గంలకు ఖచ్చి తంగా న్యాయస్థానానికి హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు నోటీసులు కూడా జారీ చేసింది. ఇకపోతే వ్యక్తిగతంగా, వర్చువల్ గా న్యాయస్థానంలో హాజరు కావాల్సి ఉందని నోటీసులో పేర్కొంది. అయితే కోర్టు ఇచ్చిన ఆదేశాలను థిక్కరించి మరీ భవనాలను కూల్చివేయడంతో కమిషనర్ రంగనాథ్ పై తెలంగాణ హై కోర్టు  సీరియస్ అయ్యింది.

కాగా, ఇటీవలే ఒక భవనాన్ని కూల్చివేసిన ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలోనే రంగనాథ్ కు హై కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక ఈ విషయం పై  కోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్  ఏం వివరణ ఇస్తారన్నది ప్రస్తుతం  ఆసక్తికరంగా మారింది. మరి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హై కోర్టు నోటీసులు ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments