nagidream
New Responsibilities To Amrapali and Chahat Bajpai: తెలంగాణ డైనమిక్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి డైనమిక్ ఆఫీసర్లకు కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
New Responsibilities To Amrapali and Chahat Bajpai: తెలంగాణ డైనమిక్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ల విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఇద్దరి డైనమిక్ ఆఫీసర్లకు కొత్త బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
nagidream
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్ సర్కార్ దూకుడు కొనసాగిస్తుంది. హామీల విషయంలో ఎలా అయితే మాట నిలబెట్టుకుంటుందో.. మరో పక్క తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కూడా అంతే ఫోకస్ గా పని చేస్తుంది. రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్, ముచ్చెర్లను నాలుగో సిటీగా డెవలప్ చేస్తానని ప్రకటించడం, ప్రాపర్టీ మార్కెట్ విలువను పెంపు వంటి వాటిపై కీలక ప్రకటనలు చేసిన రేవంత్ సర్కార్.. హైడ్రా కమిటీని ఏర్పాటు చేసి మరో సంచలనానికి తెర లేపింది. చెరువుల్ని ఆక్రమించి కట్టిన కట్టడాలను కూల్చడం, కబ్జాకి గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలతో రేవంత్ సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. డైనమిక్ ఐఏఎస్ ఆమ్రపాలికి ఉన్న అదనపు పోస్టులను తొలగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
జీహెచ్ఎంసీ కమిషనర్ గా కొనసాగుతున్న ఆమ్రపాలికి.. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్, మూసీ రివర్ బోర్డుకి, గ్రోత్ కారిడార్ కి ఎండీగా బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆమ్రపాలికి ఉన్న ఈ అదనపు పోస్టులను తొలగించింది రేవంత్ సర్కార్. ఆమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరవాసుల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండడం, హైదరాబాద్ పై రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టడం వంటి కారణాల వల్ల ఆమ్రపాలికి పూర్తి స్థాయిలో జీహెచ్ఎంసీ కమిషనర్ బాధ్యతలను అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఆమ్రపాలి.. నగరంలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు.
పలు ఏరియాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆమ్రపాలికి అదనపు బాధ్యతలను అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. కాగా ఆ అదనపు బాధ్యతలను ఆమ్రపాలి నుంచి తొలగించి.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా పూర్తిగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ బోర్డుకి, గ్రోత్ కారిడార్ కి ఆమ్రపాలిని ఎండీ బాధ్యతల నుంచి తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ప్రభుత్వం తెలంగాణలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కోట శ్రీవాత్స, మూసీ రివర్ డెవలప్మెంట్ ఎండీగా దాన కిషోర్, హెచ్ఎండీఏ మేనేజింగ్ డైరెక్టర్ గా సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా మయాంక్ మిట్టల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ గా చాహత్ బాజ్ పాయ్ ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చాహత్ బాజ్ పాయ్ గతంలో ఐటీడీఏ పీవోగా, ఆసిఫాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. మొత్తానికి అయితే ఇద్దరి లేడీ డైనమిక్ ఆఫీసర్లకి తెలంగాణ ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది.