హైదరాబాద్ వాసులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్.. రాత్రిపూట కూడా MMTS సేవలు

Hyderabad MMTS: సాధారణంగా హైదరాాబాద్ నగరంలో MMTS  రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే సేవలందిస్తాయని తెలిసిందే. కానీ, తాజాగా రాత్రిపూట కూడా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

Hyderabad MMTS: సాధారణంగా హైదరాాబాద్ నగరంలో MMTS  రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే సేవలందిస్తాయని తెలిసిందే. కానీ, తాజాగా రాత్రిపూట కూడా సేవలందించేందుకు సిద్ధమైంది. ఆ వివరాలేంటో చూద్దాం.

హైదరాబాద్ వాసులకు అత్యంత సౌకర్యవంతమైన రవాణాల్లో ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం కూడా ఒకటి. ఇది మెట్రో కన్నా ముందు నుంచి నగరంలో సేవలు అందిస్తుంది. పైగా మెట్రోతో పోలిస్తే టికెట్ ధర కూడా తక్కువ కావడంతో.. ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యర్థులు, ఇతర పనులకు వెళ్లే వారు సైతం ఈ ఎంఎంటీఎస్ రైళ్లు ప్రయాణం చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. ఇదిలా ఉంటే తాజగా ఈ ఎంఎంటీఎస్ ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రిపూట MMTS సేవలు అందించనుంది. ఆ వివరాలేంటో చూద్దాం.

సాధారణంగా MMTS  రైళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మాత్రమే సేవలందిస్తాయని తెలిసిందే. కానీ, తాజాగా రాత్రిపూట కూడా సేవలందించేందుకు సిద్ధమైంది. అయితే ప్రతిరోజు ఈ సర్వీసులు అందిస్తాయని అనుకుంటే పొరపాటే.. కేవలం రెండు రోజులకు మాత్రమే ఈ సేవలు వర్తిస్తాయి. ఎందుకంటే.. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో గణేష్ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే ఓ వైను నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే.. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో భారీగా నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. కనుక ఆ రెండు రోజుల్లో రాత్రి పూట కూడా సర్వీసులు నడిపించనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ముఖ్యంగా నిమజ్జన గరవాసులే కాదు.. పక్క జిల్లాల నుంచి కూడా ప్రజలు భారీగా తరలివస్తుంటారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని చూసేందుకు ప్రజలు ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ నిమజ్జనానికి సొంత వాహనాలు కానీ, ప్రత్యేక వాహనాలు కానీ  నగరంలో అనుమతించరు. ఎందుకంటే.. ఆ రోజున నగరంలో పెద్దఎత్తున శోభాయాత్రలు జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. కనుక వీటిని పరిగణలోకి తీసుకున్న దక్షిణ మధ్య రైల్వేశాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిమజ్జన వేడుకల్లో ప్రజలు ఎలాంటి అసౌకర్యంకు గురవ్వకుండా ఉండేందుకు ఈ ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను రాత్రిపూట కూడా నడుపుతున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఈ మేరకు సెప్టెంబర్ 17, 18వ తేదీల్లో ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయని తెలిపారు. ఉదయం 4 గంటల వరకు ఈ స్పెషల్ ట్రైన్లు సేవలు అందించనున్నాయి. మరీ, ఆ ప్రత్యేక ఎంఎంటీఎస్ రైళ్ల వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

MMTS ప్రత్యేక రైళ్ల వివరాలు:

  • 17వ తేదీన 23:10 గంటలకు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి
  • 17వ తేదీన 23:50 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి హైదరాబాద్
  • 18వ తేదీన 00:10 గంటలకు లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా
  • 18వ తేదీన 00:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి
  • 18వ తేదీన 01:50 గంటలకు లింగంపల్లి నుంచి హైదరాబాద్‌
  • 18వ తేదీన 02:20 గంటలకు ఫలక్‌నుమా నుంచి సికింద్రాబాద్‌‌.
  • 18వ తేదీన 03:30 గంటలకు హైదరాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌
  • 18వ తేదీన 04:00 గంటలకు సికింద్రాబాద్‌‌ నుంచి హైదరాబాద్‌‌‌
Show comments