అల్లుడి మరణాన్ని తట్టుకోలేక కొన్ని గంటల్లోనే అత్త మృతి

ఇష్టమైన వ్యక్తులు చనిపోతే.. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. వారు తిరిగి రారని తెలిసినా కూడా కన్నీరు కారుస్తుంటారు. వారితో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేక..జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. కానీ కొన్ని సార్లు..

ఇష్టమైన వ్యక్తులు చనిపోతే.. గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటారు. వారు తిరిగి రారని తెలిసినా కూడా కన్నీరు కారుస్తుంటారు. వారితో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేక..జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. కానీ కొన్ని సార్లు..

కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు, బంధువులు చనిపోతే ఆ బాధ వర్ణనాతీతం.  కన్నీరు తన్నుకుంటూ వస్తుంది. వారి తిరిగి రారని తెలిసి కూడా గుండెలు అలిసిపోయేలా ఏడుస్తూ ఉంటారు. కానీ ఇష్టమైన వ్యక్తులు, బాగా కావాల్సిన వారు చనిపోతే.. తట్టుకోలేం. వారినే తలచుకుని పదే పదే బాధపడుతుంటారు. మనతో కలిసి మెలిసి ఉన్నవారు ఒక్కసారిగా కానరాని లోకాలకు తిరిగి వెళ్లిపోతే.. తట్టుకోవడం కన్నీరు మున్నీరు అవుతుంటారు. వారితో ఉన్న అనుబంధాన్ని మర్చిపోలేక..జ్ఞాపకాలు నెమరేసుకుంటారు. కానీ కొందరు తమ ఇష్టమైన వ్యక్తిని తలచుకుని మానసికంగా బాధపడుతుంటారు. అయిన వారి మరణాలకు తట్టుకోలేక.. పలువురు మరణించిన సంగతి విదితమే. తాజాగా అల్లుడు మరణాన్ని తట్టుకోలేక అత్త మరణించింది

అల్లుడు మరణించిన కొన్ని గంటల వ్యవధిలో అత్త ప్రాణాలు విడిచింది. మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది ఈ తీవ్ర విషాద ఘటన. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలం చిగురుపల్లికి చెందిన నర్సింహులు.. చేగుంట మండలం మక్కరాజిపేటకు చెందిన మంగళి గ్రామంలో ఉపాధిహామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌. గత 15 రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం అస్వస్థతతకు గురికావడంతో నార్సింగిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. అతడి మరణ వార్త విన్న అత్త అత్త న్యాలపోగుల నర్సమ్మ (60)విలవిలా ఏడ్చింది.

నర్సింహులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు. అతడి మృతదేహాన్నిచూస్తూ రోదించింది. వద్దని చుట్టుప్రక్కల వారు సముదాయించిన వినిపించుకోకుండా ఏడుస్తూనే ఉంది. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. అల్లుడు.. అల్లుడు అంటూ బిగ్గరగా ఏడ్చింది. రాత్రంతా కన్నీరు కారుస్తూనే ఉంది. అల్లుడి మృతిని తట్టుకోలేక మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో గుండెపోటుకు గురై మృతిచెందింది.  కొన్ని గంటల వ్యవధిలోనే అత్తా అల్లుడు చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.  కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.  ఇద్దరు ఒకే రోజు చనిపోవడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Show comments