ప్రభుత్వ టీచర్లకు ప్రమోషన్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు సంక్షేమ పథకాలపై దృష్టి మొదలు పెట్టారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పలు సంక్షేమ పథకాలపై దృష్టి మొదలు పెట్టారు. ఆరు గ్యారెంటీలకు సంబంధించిన దరఖాస్తు కోసం ప్రజా పాలన కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ పథకాల్లో రెండు గ్యారెంటీ పథకాలు ప్రారంభించారు. ప్రజా పాలన కార్యక్రమంతో ఆరు గ్యారెంటీ పథకాల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మూరుమూల గ్రామాల నుంచి పట్టణాల వరకు విపరీతమైన స్పందన లభిస్తుంది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ టెట్ అంశం చర్చకు వచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు విద్యాశాఖ పూర్తి సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే విద్యాశాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ టీచర్లకు పదోన్నతి దక్కాలంటే టెట్ తప్పని సరి అని అధికారులకు సీఎం తెలిపినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణలో టెట్ నిర్వహించాలని రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఏప్రిల్ లో ఈ పరీక్ష నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. విద్యాహక్కు చట్టం, జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనల ప్రకారం టీచర్లుగా నియమితులైన వారు ప్రమోషన్ పొందాలంటే తప్పని సరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉపాధ్యాయుల్లో టెన్షన్ మొదలైంది. కొత్త నియామకాల్లో ఇలాంటి నిబంధనలు అమలు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ, పదోన్నతుల విషయంలో మాత్రం అమలు చేయడం లేదని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వారికే పదోన్నతులు ఇవ్వాలని పలువురు ఉపాధ్యాయులు ఇటీవల హైకోర్టుని ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రమోషన్ కావాలంటే టెట్ ఉత్తీర్ణులైన వారికి సీనియార్టీ జాబితా సమర్పించాలని… గత సెప్టెంబర్ నెల 27న హైకోర్టు మధ్యంతర తీర్పు ఇవ్వడంతో స్కూల్ అసిస్టెంట్స్, గెజిటెడ్ హెచ్ ఎం గా కొంతమందికి దక్కాల్సిన ప్రమోషన్ దక్కలేదు. రాష్ట్రంలో మొత్తం ఒకలక్షా 22 వేల 386 ఉపాధ్యాయ పోస్టులు ఉంటే.. దాదాపు 26 వేల మంది టెట్ పాసైన టీచర్లు ఉన్నారు. మరి మిగిలిన టీచర్లకు టెట్ అర్హత లేదు.. ఈ క్రమంలో ప్రభుత్వం వారి విషయంలో ఎలా వ్యవహరిస్తుందో అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments