భారీ వర్షాలు.. స్కూళ్ళ సెలవులపై కలెక్టర్లకు మంత్రి ఆదేశాలు

Minister Ponguleti Srinivasa Reddy On School Holidays: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ళ సెలవులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

Minister Ponguleti Srinivasa Reddy On School Holidays: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కూళ్ళ సెలవులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

భారీ వర్షాల కారణంగా స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఇబ్బంది ఎదురవుతుంది. కుండపోత వర్షాలు పడితే రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి. దీని వల్ల వాహనదారులే కాకుండా విద్యార్థులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు, కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ రోడ్ల మీద నడవాలంటేనే విద్యార్థులకు కష్టంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్న నేపథ్యంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలు పడినప్పుడు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయా? ఉండవా? అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. మరో వారం పాటు కుండపోత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

ముఖ్యంగా వచ్చే నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అధికారులు పలు జిల్లాలకు ఎల్లో, రెడ్ అలర్ట్ లను కూడా ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు సెలవులు ప్రకటించాయి. అయితే అప్పటికప్పుడు సెలవులు ప్రకటించడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళాక సెలవు అని తెలుస్తుంది. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ వర్షాల వేళ విద్యాసంస్థలకు సెలవుల విషయంలో కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల మీద సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో సీఎస్ శాంతి కుమారి, జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వానల పట్ల జాగ్రత్తగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది అని ఆయా జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో, వరద ముప్పు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. నాలుగైదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశాలు జారీ చేశారు. వర్ష సూచనలు, స్థానిక పరిస్థితులను బట్టి పాఠశాలలకు, కళాశాలలకు సెలవులు కలెక్టర్లే ప్రకటించవచ్చునని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులను బట్టి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు.  

Show comments