New Ration Cards: రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి గుడ్ న్యూస్..!

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే అలా కొత్తరేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.

తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే అలా కొత్తరేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త.

తెలంగాణ రాష్ట్రంలో కొత్ రేషన్ కార్డుల కోసం ఎదురు  చూస్తున్నావారు చాలా మంది ఉన్నారు. గత ప్రభుత్వం  కొత్త రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో ఇటీవలే కొత్త ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంపై పేదలు  ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అలానే ప్రజల పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ప్రజాపాలన పేరుతో కొత్తరేషన్ కార్డులు, ఇతర పథకాలకు సంబంధించి దరఖాస్తులను స్వీకరించారు. ఈ క్రమంలోనే కొత్త రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని పేద ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

సోమవారం తెలంగాణ మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఇక ఈ సమావేశంలో అన్ని శాఖలకు చెందిన మంత్రులు పాల్గొన్నారు. 4 గంటల పాటు జరిగిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై మంత్రులు చర్చించారు. సన్నవడ్లపై రూ.500లు బోనస్ ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 2న తెలంగాణ  అవతరణ  దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించింది. అలానే ధ్యాన్యం కొనుగోలు గురించి కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. సమావేశం ముగిసిన అనంతరం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల గురించి ప్రస్తావించారు. అలానే ఈ కార్డుల జారీ విషయంలో పేదలకు శుభవార్తనే అందించారు.

ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇండ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. అలానే అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని మంత్రి తెలిపారు. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తామని, అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని స్పష్టం చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. పైరవీలకు తావు లేకుండా అర్హులందరికీ ఇళ్లు నిర్మిస్తామాని ఆయన హామీ ఇచ్చారు.

గత పది ఏళ్లుగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, ఎన్నికల కోడ్ ముగిశాక అర్హులను ఎంపిక చేస్తామని మంత్రి తెలిపారు. విద్యా, వైద్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని ఆయన తెలిపారు.తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల కోసం లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్ల నుంచి కొత్త రేషన్‌ కార్డులు లేక ఇబ్బందులు పడ్డారు. అయితే ఇలా కొత్తరేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పై విధంగా శుభవార్త అందించారు. మొత్తంగా ఎన్నికల కోడ్ ముగియగానే..కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Show comments