P Venkatesh
HYDRAA: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు తీపికబురు అందబోతున్నట్లు సమాచారం. హోమ్ లోన్స్ మాఫీపై హైడ్రా కమిషనర్ బ్యాంకర్లతో చర్చించనున్నట్లు సమాచారం.
HYDRAA: తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధితులకు తీపికబురు అందబోతున్నట్లు సమాచారం. హోమ్ లోన్స్ మాఫీపై హైడ్రా కమిషనర్ బ్యాంకర్లతో చర్చించనున్నట్లు సమాచారం.
P Venkatesh
తెలంగాణ ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. చెరువులను, ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. చెరువులు, బఫర్ జోన్స్, ఎఫ్ టీఎల్, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. పేదలు, పెద్దలు అనే తారతమ్యం లేకుండా నిబంధనలకు విరుద్దంగా స్థలాలను ఆక్రమించుకుని చేపట్టిన నిర్మాణాలను బుల్డోజర్లతో పడగొడుతున్నది. హైడ్రా చర్యలు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. అయితే హైడ్రా కూల్చివేతలకు మొదట్లో పలు వర్గాల నుంచి మద్దతు లభించింది.
ప్రస్తుతం బాధితుల నుంచి హైడ్రాపై వ్యతిరేఖత వస్తుంది. నోటీసులు ఇవ్వకుండా, కనీసం ఇంట్లో సామాన్లు తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వటం లేదని బాధితులు మండిపడుతున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని పైసా పైసా కూడబెట్టుకుని స్థలాలు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకుంటే నిమిషాల్లోనే కూల్చివేస్తున్నారంటూ హైడ్రాపై ఫైర్ అవుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల జరిగిన కేబినెట్ మీటింగ్ లో హైడ్రాకు విస్తృత అధికారులు కల్పిస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో హైడ్రా మరింత దూకుడుగా దూసుకెళ్తున్నది. ఈక్రమంలో హైడ్రా కూల్చివేతల వేళ బాధితులకు తీపికబురు అందబోతున్నట్లు సమాచారం అందుతోంది.
హైడ్రా కూల్చివేసిన ఇళ్లకు సంబంధించిన హోమ్ లోన్స్ మాఫీ అయ్యేలా బ్యాంకర్లతో చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. హోమ్ లోన్స్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బ్యాంకర్లతో మీటింగ్ జరుపనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చెరువుల, ఎఫ్ టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు లోన్స్ ఇచ్చేటప్పుడు బ్యాంక్ అధికారులు జాగ్రత్త పడాలని హైడ్రా సూచించనున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఏ డాక్యూమెంట్స్ ఆధారంగా లోన్స్ ఇచ్చారు. లీగల్ ఒపీనియన్ ఎలా తీసుకున్నారనే దానిపై చర్చలు జరుపనున్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా క్లియరెన్స్ ఉంటేనే హోమ్ లోన్స్ ఇచ్చే విధంగా నిబంధనల రూపకల్పనపై చర్చించనున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు నష్టపోయిన బాధితుల హోమ్ లోన్స్ ఏం చేయాలన్న దానిపై హైడ్రా కమిషనర్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇళ్లు, స్థలాలు కోల్పోయిన బాధితులకు హోమ్ లోన్స్ గుదిబండగా మారాయి. ఇలాంటి సమయంలో హోమ్ లోన్స్ కనుక మాఫీ అయితే బాధితులకు భారీ ఊరట లభించనట్లు అవుతుంది. హైడ్రా కమిషనర్ బ్యాంకర్లతో చర్చలు జరిపిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. బాధితుల హోమ్ లోన్స్ మాఫీ చేస్తారన్న సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.