హైడ్రాకు మరిన్ని ప్రత్యేక అధికారాలు! రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!

Hydra AV Ranganath: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలు చేపట్టిన వారిని హైడ్రా హడలెతిస్తోంది. ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు రానున్నాయి.

Hydra AV Ranganath: హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణలు చేపట్టిన వారిని హైడ్రా హడలెతిస్తోంది. ఇలా అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్న హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు రానున్నాయి.

ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తోన్న పేరు హైడ్రా. హైదరాబాద్ నగరంలోని చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై కొరడ ఝుళిపిస్తున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఎవ్వర్ని వదలకుండా అక్రమ నిర్మాణాలు చేసిన వారి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖల నిర్మాణాలను హైడ్రా కూల్చేసిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే హైడ్రాకు ప్రజల నుంచి ఓ రేంజ్ లో మద్దతు లభిస్తుంది. ఇదే సమయంలో హైడ్రాను రద్దు చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా పూర్తిగా చట్టబద్దమైనదేనని స్పష్టం చేశారు. వర్కింగ్ కమీటి తీర్మానం ద్వారానే.. హైడ్రాను ఏర్పాటు చేశారని చెప్పుకొచ్చారు. హైడ్రాకు చట్టబద్దత కల్పిస్తూ అక్టోబర్‌లోపు ఆర్డినెన్స్‌ వస్తుందని కమిషనర్ తెలిపారు. అంతేకాక త్వరలోనే హైడ్రాకు మరిన్ని విశేష అధికారాలు వస్తాయని ఏవీ రంగనాథ్ తెలిపారు. ఆరు వారాల తర్వాత.. అసెంబ్లీలో హైడ్రా బిల్లు వస్తుందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో సేవలందిస్తున్న గ్రేహౌండ్స్‌, టాస్క్‌ఫోర్స్‌ తరహాలోనే హైడ్రా సంస్థ కూడా పనిచేస్తుందని ఆయన వివరించారు. మున్సిపాలిటీలు, ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు తమవంతు సహకారం అందిస్తామని కమిషనర్ చెప్పుకొచ్చారు. ఇక ఇదే సమయంలో హైడ్రాకు మరో కీలక బాధ్యత కూడా అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు సమచారం. నగరంలో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ను హైడ్రా ఇస్తేనే.. నిర్మాణాలు చేపట్టేలా.. ఆ సంస్థకు అధికారాలు కట్టబెట్టనున్నట్టు తెలుస్తోంది. అయింతే.. అందుకు సంబంధించిన విధివిధానాలను తర్వలోనే విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. దీంతో.. నగరవ్యాప్తంగా ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్న.. మిగతా శాఖలతో పాటు హైడ్రా అనుమతులు కూడా ఉండాల్సిందే.

ఇంకా చెప్పాలంటే ఇతర శాఖల పర్మిషన్ల కంటే ముందు.. హైడ్రా NOC ఇస్తేనే మిగతా శాఖలు అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ప్రస్తుతం హైడ్రాను రద్దు చేయాలంటూ కొందరు పిటిషన్ వేశారు. వాటిపై తెలంగాణ హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కొన్ని అంశాలపై పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్నిఆదేశించింది. కాగా.. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మొత్తంగా త్వరలో హైడ్రాకు మరిన్ని అధికారాలు రానుడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments