హైడ్రాను అలా చూపిస్తే..భవిష్యత్ తరాలకు నష్టమే: రంగనాథ్

Hydra Commissioner Ranganath: హైదరాబాద్ నగర వాసులను ‘హైడ్రా’ హడల్ ఎత్తిస్తోంది. సామాన్యులకు వణుకు పుట్టిస్తుంది. తాజాగా హైడ్రా దెబ్బకు ఓ ప్రాణం బలైంది. ఇల్లు కూల్చేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మహిళ చనిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

Hydra Commissioner Ranganath: హైదరాబాద్ నగర వాసులను ‘హైడ్రా’ హడల్ ఎత్తిస్తోంది. సామాన్యులకు వణుకు పుట్టిస్తుంది. తాజాగా హైడ్రా దెబ్బకు ఓ ప్రాణం బలైంది. ఇల్లు కూల్చేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. మహిళ చనిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు.

హైదరాబాద్ నగర వాసులను ‘హైడ్రా’ హడల్ ఎత్తిస్తోంది. సామాన్యులకు వణుకు పుట్టిస్తుంది. ఎన్నో ఇళ్లను కూల్చేస్తుంది.  సామాన్యుల నుంచి ప్రముఖల వరకు ఎవర్ని వదిలిపెట్టకుండా..ప్రభుత్వం జాబితాలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తుంది. ఈ క్రమంలోనే పలువురు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హైడ్రా దెబ్బకు ఓ ప్రాణం బలైంది. ఇల్లు కూల్చేస్తారనే భయంతో కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో నివాసం ఉంటున్న గుర్రాంపల్లి బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.  ఈ ఘటనతో ప్రతిపక్షపార్టీలు హైడ్రాపై విమర్శలు చేస్తున్నాయి. అంతేకాక పలువురు హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహిళ చనిపోయిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. బుచ్చమ్మ మరణం బాధాకరం అని ఆయన తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో హైడ్రాపై విమర్శలు చేసే వారికి కీలక సూచనలు చేశారు. హైడ్రాను బూచిగా చూపించడం మానుకోవాలని హితవు పలికారు. పేదలకు భరోసా కల్పించేందుకే హైడ్రా ఉందని, దీనిపై లేనిపోని భయాలు పెట్టుకోవద్దని సూచించారు. హైడ్రాను భయం, బూచీగా చూపించటం  మంచిది కాదని తెలిపారు. పేదలు, దిగుమ మధ్య తరగతి కుటుంబాల వాళ్లకు అన్యాయం చేయాలనే ఉద్దేశం హైడ్రాకు లేదని ఆయన స్పష్టం చేశారు. చెరువుల్లో కట్టి ఉంటే నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. అయినప్పటికీ చెరువుల్లో ఉండే ఇళ్లకు నోటీసులు ఇచ్చి మరీ చర్యలు తీసుకుంటున్నామని రంగనాథ్ చెప్పారు. తగినంత సమయం ఇచ్చిన తర్వాతే చర్యలు తీసుకుంటున్నామని కూడా ఆయన వెల్లడించారు. చిన్న వాళ్లు, పేదలు ఉంటే వాళ్ల జోలికి వెళ్లటం లేదని, టైం ఇస్తున్నామని స్పష్టం చేశారు.  పేదవాళ్లకు న్యాయం చేసిన తరువాతనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

ఇదే సందర్భంగా అమీ్ పూర్ కూల్చివేతల గురించి హైడ్రా కమిషనర్ ప్రస్తావించారు. అమీన్ పూర్ లో ప్రభుత్వ భూములు పెద్ద ఎత్తున అన్యాక్రాంతం అయ్యాయని తెలిపారు. అమీన్ పూర్ లో ఒక ఆస్పత్రిపై అధికారులు గతంలో చర్యలు తీసుకున్నా..తిరిగి నిర్మించారని తెలిపారు. అలాంటి ఆస్పత్రిని కూల్చిన సమయంలో అందులో రోగులు ఎవరూ లేరని, వీడియో కూడా రికార్డు చేశామని రంగనాథ్ తెలిపారు. ఎన్ కన్వెన్షన్ ను కూల్చి వేశాం..దాని పక్కన ఉన్న గుడిసెలను కూల్చలేదుని, ప్రజలు నివసిస్తున్న భవనాలను ఎక్కడ కూల్చలేదని హైడ్రా కమిషనర్ తెలిపారు. కొందరు ముందస్తు సమాచారం ఇచ్చినా ఖాళీ చేయడం లేదని, సరైనా సమయం ఇచ్చిన తర్వాతే ఆక్రమణలు కూల్చివేస్తున్నామని తెలిపారు.

పేదలు, మధ్య తరగతి ప్రజలు చెరువులను ఆక్రమించరు. అక్రమ కట్టడాల వెనుక పెద్దవాళ్ల ఉన్నారు. ప్రభుత్వ ఆస్తుల రక్షణకే సీఎం హైడ్రాను తీసుకొచ్చారని రంగనాథ్ తెలిపారు. విపత్తు నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ హైడ్రా బాధ్యతని అన్నారు. హైడ్రాను బూచిగా చూపించి ప్రజలను భయపెడితే భవిష్యత్ తరాలకు నష్టం జరుగుతుందని ఆయన తెలిపారు. చెరువులు, ప్రభుత్వ భూములను ఎవరు కాపాడలేరని రంగనాథ్ వివరించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మరి..హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments